విశ్వక్ సేన్ నటిస్తున్న లేటెస్ట్ చిత్రం ‘ఫంకీ’(Funky). దర్శకుడు కెవి అనుదీప్ ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేస్తున్నాడు. ఈ సినిమా ఫిబ్రవరి 13న గ్రాండ్ రిలీజ్ కాబోతుంది. ఐతే, రిలీజ్ కి ఇంకా రెండు వారాలు కూడా లేదు, కానీ, ఇంకా ఈ సినిమా డబ్బింగ్ కార్యక్రమాలను పూర్తి చేసుకోలేదు. ఈ రోజు కూడా ప్రసాద్ ల్యాబ్ లో విశ్వక్ సేన్ తన పాత్రకు డబ్బింగ్ చెబుతున్నాడు. రేపటి లోపు డబ్బింగ్ ఫినిష్ చేయాలని టీమ్ కసరత్తులు చేస్తోంది. విశ్వక్ సేన్ ఒక్కడిదే డబ్బింగ్ బ్యాలెన్స్ అని తెలుస్తోంది.
ఇక ఈ సినిమాలో అందాల భామ కయాదు లోహర్ హీరోయిన్గా నటిస్తుంది. కయాదు లోహర్ – విశ్వక్ మధ్య కెమిస్ట్రీ బాగా వర్కౌట్ అయింది అట. సినిమాలో పెద్దగా కథ లేకపోయినా.. కామెడీ సీన్స్ అండ్ డైలాగ్స్ పేలాయి అని తెలుస్తోంది. ఈ చిత్రానికి భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తుండగా సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చున్ ఫోర్ సినిమాస్ బ్యానర్లపై నాగవంశీ, సాయి సౌజన్య ప్రొడ్యూస్ చేస్తున్నారు. ఈ సినిమా పై మంచి అంచనాలు ఉన్నాయి.
