సంక్రాంతికి కాంబినేషన్ మళ్లీ సంక్రాంతికే లాక్!

Sankranthiki Vasthunam

మన తెలుగు సినిమా దగ్గర సంక్రాంతి బాక్సాఫీస్ రన్ నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. కరెక్ట్ సినిమాలు పడితే ఈజీగా ఈ ఒక్క సంక్రాంతి రేస్ లోనే 500 కోట్లకి పైగా వసూళ్లు ఈజీగా వచ్చేస్తాయి. ఇక ఈ సంక్రాంతి బాక్సాఫీస్ దగ్గర దర్శకుడు అనీల్ రావిపూడికి స్పెషల్ మార్క్ కూడా ఉంది. గత ఏడాది సంక్రాంతికి వస్తున్నాం ఈ ఏడాది మన శంకర వరప్రసాద్ గారు చిత్రాలతో రికార్డ్ గ్రాసర్స్ అందించి నెక్స్ట్ సంక్రాంతి కాంబినేషన్ కూడా లాక్ చేసేసినట్టు తెలుస్తోంది.

ఆల్రెడీ వెంకీ మామ త్రివిక్రమ్ తో సినిమా చేస్తుండగా ఈ సినిమా తర్వాత వెంటనే అనీల్ రావిపూడితో సినిమా స్టార్ట్ చేసి వచ్చే ఏడాది సంక్రాంతి రేస్ లోనే ఆ సినిమాని ఫినిష్ చేసి రిలీజ్ చేసేస్తారని తెలుస్తోంది. దీనితో మళ్లీ సంక్రాంతికి వస్తున్నాం కాంబినేషన్ మళ్లీ సంక్రాంతికే రాబోతున్నారని చెప్పొచ్చు. ఈ సినిమాలో రానా దగ్గుబాటి కూడా నటిస్తాడనే టాక్ ఉంది. కరెక్ట్ సినిమా పడితే దగ్గుబాటి అభిమానులకి అది మరపురాని సంక్రాంతి అవుతుందని కూడా చెప్పొచ్చు.

Exit mobile version