మెగాస్టార్ చిరంజీవి హీరోగా దర్శకుడు వశిష్ట కాంబినేషన్ లో రాబోతున్న చిత్రం “విశ్వంభర” (Vishwambhara). ‘కపుల్ ఫ్రెండ్లీ’ ట్రైలర్ విడుదల కార్యక్రమంలో, యూవీ క్రియేషన్స్‌కు చెందిన అజయ్ కుమార్ మెగాస్టార్ సినిమా గురించి మాట్లాడుతూ.. ‘ఈ సినిమా టీజర్ లోని విఎఫ్ఎక్స్ కి మంచి స్పందన రాలేదు. అందుకే, రెండో టీజర్ లో పటిష్టమైన విఎఫ్ఎక్స్ ఉండేలా చూసుకున్నాం. విశ్వంభర (Vishwambhara) ఒక పెద్ద సినిమా, అందుకే, సీజీకి సమయం పడుతుంది’ అని తెలిపారు.
కాగా ఈ సినిమాలో త్రిష కృష్ణన్ కథానాయికగా నటిస్తోంది. అన్నట్టు ‘జగదేకవీరుడు అతిలోకసుందరి’ సినిమాలోని వినోదం, ‘హిట్లర్’ లోని సెంటిమెంట్ ఈ సోషియో ఫాంటసీ సినిమాలో కనిపిస్తాయని తెలుస్తోంది. కాగా సృష్టి, స్థితి, లయ ఈ మూడింటి నేపథ్యంలో ఈ కథ సాగుతుందట. ఈ భారీ చిత్రానికి ఆస్కార్ విన్నర్ కీరవాణి సంగీతం అందిస్తుండగా యూవీ క్రియేషన్స్ వారు భారీ బడ్జెట్ తో నిర్మాణం వహిస్తున్నారు.
ఈ చిత్రంలో ఆషిక రంగనాథ్, రమ్య పసుపులేటి, ఇషా చావ్లా మరియు అశ్రిత వేముగంటి నండూరి కూడా కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమా అప్ డేట్స్ కోసం ఫ్యాన్స్ చాలా ఎగ్జైటెడ్ గా ఎదురు చూస్తున్నారు.
