ఆ ప్రాంతంలో ‘వారణాసి’ షూటింగ్.. తొలి ఇండియన్ మూవీగా రికార్డు..!

Varanasi

టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ ఎస్.ఎస్.రాజమౌళి, సూపర్ స్టార్ మహేష్ బాబు కాంబినేషన్‌లో రూపొందుతున్న గ్లోబల్ అడ్వెంచర్ ఫిలిం ‘వారణాసి’ ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఈ చిత్రం ద్వారా భారతీయ సినిమా చరిత్రలో మరో అరుదైన మైలురాయి నమోదు కానుంది. ప్రపంచవ్యాప్తంగా అంటార్కిటికాలో చిత్రీకరించిన సినిమాల జాబితాలో ఇది ఐదవ చిత్రంగా, మరియు ఈ ఘనత సాధించిన తొలి భారతీయ సినిమాగా నిలవనుంది.

అంటార్కిటికా షెడ్యూల్‌కు సంబంధించిన తాజా సమాచారం ప్రకారం, ఈ నెలాఖరున చిత్ర బృందం అక్కడ కీలక సన్నివేశాలను చిత్రీకరించనుంది. గతంలో ‘ది థింగ్’, ‘ఎయిట్ బిలో’, ‘ఎన్‌కౌంటర్స్ ఎట్ ది ఎండ్ ఆఫ్ ది వరల్డ్’ వంటి హాలీవుడ్ చిత్రాలు మాత్రమే ఇక్కడ షూటింగ్ జరుపుకున్నాయి. ఇప్పుడు రాజమౌళి తన విజన్‌తో ఈ ఎలైట్ క్లబ్‌లో ‘వారణాసి’ని చేర్చబోతున్నారు. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ కెన్యా, దక్షిణాఫ్రికాతో పాటు పలు అంతర్జాతీయ లొకేషన్లలో శరవేగంగా సాగుతోంది.

ఈ భారీ బడ్జెట్ చిత్రంలో గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా హీరోయిన్‌గా నటిస్తుండగా, మలయాళ స్టార్ నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్ విలన్‌గా కనిపించనున్నారు. ఎం.ఎం.కీరవాణి సంగీతం అందిస్తున్న ఈ సినిమాను ఏప్రిల్ 7, 2027న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేసేందుకు చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తోంది.

Exit mobile version