‘యుఫోరియా’ ఫస్ట్ రివ్యూ.. ఆది సాయి కుమార్ రెస్పాన్స్ ఇదే..!

Europhia

టాలీవుడ్ దర్శకుడు గుణశేఖర్ తెరకెక్కించిన లేటెస్ట్ చిత్రం ‘యుఫోరియా’(Europhia) ప్రేక్షకుల్లో మంచి బజ్ క్రియేట్ చేసింది. ఈ సినిమాను ఫిబ్రవరి 6న గ్రాండ్ రిలీజ్ చేసేందుకు మేకర్స్ రెడీ అయ్యారు. అయితే, ఈ సినిమాలోని కథ ప్రేక్షకులకు కనెక్ట్ అయ్యే విధంగా నిజజీవితంలో జరిగిన సంఘటనల ఆధారంగా రూపొందించినట్లు మేకర్స్ ప్రమోట్ చేస్తున్నారు. కాగా, ఈ సినిమాకు తొలి రివ్యూ ఇచ్చాడు హీరో ఆది సాయి కుమార్.

‘యుఫోరియా’ చిత్రాన్ని ప్రత్యేకంగా వీక్షించిన ఆయన ఈ సినిమాలోని సెన్సిటివ్ సబ్జెక్ట్, రియల్ లైఫ్ ఇన్సిడెంట్ ఆకట్టుకుంటాయని.. కథను ప్రెజెంట్ చేసిన వైవిధ్యమైన తీరు అందరికీ నచ్చుతుందని తెలిపాడు. ఇక ఈ సినిమాలోని క్లైమాక్స్ ప్రేక్షకులకు చాలాకాలం గుర్తుండిపోతుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఇలాంటి సినిమాను తీసిన గుణశేఖర్ అండ్ టీమ్‌కు ఆది సాయి కుమార్ ఆల్ ది బెస్ట్ తెలిపాడు.

ఇలా ‘యుఫోరియా’ చిత్రంపై ఆది సాయి కుమార్ రివ్యూ ఇవ్వడంతో ప్రస్తుతం ఇది సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. ఇక ఈ సినిమాలో ‘ధురంధర్’ ఫేమ్ బ్యూటీ సారా అర్జున్, భూమిక, గౌతమ్ మీనన్, నాజర్ తదితరులు ముఖ్య పాత్రల్లో నటించారు. కాల భైరవ సంగీతం అందించిన ఈ చిత్రాన్ని గుణ టీమ్ వర్క్స్ బ్యానర్ పై నీలిమ గుణ, యుక్తా గుణ ప్రొడ్యూస్ చేశారు.

Exit mobile version