‘ఉస్తాద్ భగత్ సింగ్’ సెకండ్ సాంగ్ అప్డేట్.. పవన్‌కు పీక్ ఎలివేషన్స్ గ్యారెంటీ..!

Ustaad Bhagat Singh

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మోస్ట్ అవైటెడ్ మూవీ ‘ఉస్తాద్ భగత్ సింగ్’ (Ustaad Bhagat Singh)గురించి ఒక క్రేజీ అప్‌డేట్ ఇచ్చారు మేకర్స్. ఈ సినిమా నుండి సెకండ్ సింగిల్ సాంగ్‌ను త్వరలో రిలీజ్ చేసేందుకు సిద్ధమవుతున్నారు మేకర్స్. అయితే, ఈ పాటలో వచ్చే ‘‘ఏ తరమైనా నీ తరమే.. మా గుండెలో నీ స్థానం సుస్థిరమే’’ అనే లిరిక్స్ పవన్ కళ్యాణ్ ఇమేజ్‌ను, ఆయనకున్న మాస్ క్రేజ్‌ను మరో స్థాయికి తీసుకెళ్లేలా ఉంటాయని చిత్ర యూనిట్ చెబుతోంది.

ఈ పవర్‌ఫుల్ లైన్స్ థియేటర్లలో ఫ్యాన్స్‌కు పూనకాలు తెప్పించడం ఖాయమని, కళ్యాణ్ గారి ‘ఆరా’ను ఈ పాట అద్భుతంగా ఎలివేట్ చేస్తుందని నెటిజన్లు పోస్ట్లు పెడుతున్నారు. హరీష్ శంకర్ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాపై ఈ లైన్స్ మరింత హైప్‌ను పెంచాయి. ఇక ఈ పాటతో పవన్ ఫ్యాన్స్‌కు అదిరిపోయే ట్రీట్ ఖాయమని చిత్ర యూనిట్ చెబుతోంది.

ఇక ఈ సినిమాలో శ్రీలీల, రాశి ఖన్నా హీరోయిన్లుగా నటిస్తుండగా దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ ప్రొడ్యూస్ చేస్తున్నారు.

Exit mobile version