నాచురల్ స్టార్ నాని హీరోగా నటిస్తున్న లేటెస్ట్ అవైటెడ్ సినిమానే ది ప్యారడైజ్. భారీ అంచనాలు ఉన్న ఈ చిత్రాన్ని దర్శకుడు శ్రీకాంత్ ఓదెలా తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమా ఈ పాటికే విడుదల కావాల్సి ఉంది కానీ ఆలస్యం అయ్యింది. ఇక ఇదిలా ఉండగా ఈ సినిమా నుంచి అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న టీజర్ కట్ కి మేకర్స్ నేడు సమయం లాక్ చేశారు.
ఈ సాయంత్రం విడుదల కానున్న టీజర్ పైనే ఇప్పుడు అందరి కళ్ళు పడ్డాయి. కేవలం టీజర్ ఎలా ఉంటుంది అనే కాకుండా కొత్త రిలీజ్ డేట్ కూడా దీనితోనే వస్తుందా లేదా అనేది కూడా ఆసక్తిగా మారింది. సో ఇలా ప్యారడైజ్ టీజర్ కోసం అంతా ఓ రేంజ్ లో ఎదురు చూస్తున్నారు. ఇక ఈ సినిమాకు అనిరుద్ సంగీతం అందిస్తున్నాడు. అలాగే ఎస్ ఎల్ వి సినిమాస్ నిర్మాణం వహిస్తున్న సంగతి తెలిసిందే.
