జోర్డాన్ కు వెళ్లిన ఎన్టీఆర్.. ఆ సినిమా కోసమే !

NTR-Neel

ప్రశాంత్ నీల్ – ఎన్టీఆర్ కలయికలో రాబోతున్న సినిమా (వర్కింగ్ టైటిల్ డ్రాగన్) పై లేటెస్ట్ అప్ డేట్ వచ్చింది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది, కీలక సన్నివేశాలను చిత్రీకరించడానికి టీం ఇప్పుడు తొలిసారి భారతదేశం నుండి జోర్డాన్ కి బయలుదేరుతోంది. తారక్ ఈ ఉదయం జోర్డాన్ కు విమానంలో వెళ్తుండగా హైదరాబాద్ లోని ఎయిర్ పోర్ట్ లో కనిపించాడు, జోర్డాన్ లో విస్తృతమైన యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరించనున్నారు. భారీ స్థాయిలో, భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమా పై భారీ అంచనాలు ఉన్నాయి.

కాగా మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రాబోతున్న ఈ సినిమాలో యాక్షన్ అద్భుతంగా ఉంటుందట. పైగా ఈ సినిమాని ఎన్టీఆర్ కెరీర్ లోనే అత్యుత్తమ సినిమాల్లో ఒకటిగా చేయాలని ప్రశాంత్ నీల్ ప్రయత్నం చేస్తున్నాడట. అందుకే, ఈ సినిమా స్క్రిప్ట్ కోసం ప్రశాంత్ నీల్ చాలా టైమ్ తీసుకున్నాడు. కాబట్టి, ఇప్పటి వరకూ ప్రశాంత్ నీల్ తీసిన అన్ని సినిమాల్లోకల్లా బెస్ట్ సినిమా ఇదే అవుతుందని అంచనాలు ఉన్నాయి.

Exit mobile version