టాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర ఇటీవల రిలీజ్ అయిన చిత్రాల్లో దర్శకుడు గుణశేఖర్ తెరకెక్కించిన ‘యుఫోరియా’ కూడా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి మిశ్రమ స్పందన లభించింది. అయితే, బాక్సాఫీస్ దగ్గర మాత్రం కలెక్షన్స్ రాబట్టడంలో ఈ సినిమా విజయం సాధించలేకపోయింది. ఈ సినిమాలోని క్యాస్టింగ్ విషయంలో ఇటీవల ఓ ఇంటర్వ్యూలో దర్శకుడు గుణశేఖర్ ఓ సర్ప్రైజింగ్ విషయాన్ని రివీల్ చేశారు.
యుఫోరియా చిత్రంలో గౌతమ్ వాసుదేవ్ మీనన్ ఓ పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటించారు. అయితే, ఆ పాత్రలో తొలుత మెగాస్టార్ చిరంజీవిని తీసుకోవాలని గుణశేఖర్ ప్రయత్నించారట. చిరు కూడా పాత్ర నచ్చడంతో సినిమాపై ఇంట్రెస్ట్ చూపెట్టారట. కానీ, ప్రస్తుతం ఆయన ఉన్న స్టేజీలో ఇలాంటి స్పెషల్ రోల్స్ చేయడం మంచిది కాదేమో అని భావించి ఆయన ఈ సినిమాకు నో చెప్పారట.
ఇలా యుఫోరియా చిత్రంలో చిరంజీవి పాత్రపై గుణశేఖర్ రివీల్ చేసిన విషయం ప్రస్తుతం అభిమానుల్లో ఆసక్తిని క్రియేట్ చేసింది. ఒకవేళ ఈ సినిమాలో చిరంజీవి ఆ పాత్రలో నటించి ఉంటే, ఈ చిత్రానికి మరింత సాలిడ్ ఇంపాక్ట్ లభించేంది. చిరు ప్రభావం కలెక్షన్స్‌పై కూడా ఉండేదని మెగా ఫ్యాన్స్ అంటున్నారు.
