ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ ఈటీవీ ఒరిజినల్ ఫిల్మ్‌గా తెరకెక్కిన ‘సంప్రదాయిని సుప్పిణి సుద్దపూసని'(Sampradayani Suppini Suddapoosani) చిత్రం ఫిబ్రవరి 12న ఓటీటీలో రిలీజ్ కావాల్సింది. కానీ, ఇప్పుడు ఈ చిత్రం రూటు మార్చింది. ఈ క్రైమ్ కామెడీ కథాంశం థియేటర్లలో అయితేనే ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అవుతుందని చిత్ర బృందం భావించింది. అందుకే ఓటీటీ ప్లాన్‌ను పక్కన పెట్టి, ఈ చిత్రాన్ని మార్చి 6, 2026న భారీ స్థాయిలో థియేటర్లలో విడుదల చేసేందుకు సిద్ధమయ్యారు.
నటుడు శివాజీ మరియు లయ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమాపై ఇప్పటికే సోషల్ మీడియాలో మంచి బజ్ నెలకొంది. ఈ క్రేజీ ప్రాజెక్ట్‌ను ప్రముఖ డిస్ట్రిబ్యూటర్లు వంశీ నందిపాటి మరియు బన్నీ వాస్ విడుదల చేస్తున్నారు. ఇటీవల ‘రాజు వెడ్స్ రాంబాయ్’, ‘ఈషా’ వంటి చిన్న చిత్రాలను తమదైన ప్రమోషన్స్‌తో సక్సెస్ చేశారు. ఇప్పుడు వీరు ఈ సినిమాను కూడా జనాల్లోకి బలంగా తీసుకెళ్తారని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి.
శివాజీ స్వయంగా నిర్మించిన ఈ చిత్రానికి సుధీర్ శ్రీరామ్ దర్శకత్వం వహించారు. ఇందులో మాస్టర్ రోహన్, అలీ, ధనరాజ్, ప్రిన్స్, జబర్దస్త్ ఇమ్మాన్యుయేల్ మరియు రాజ్ తిరందాసు కీలక పాత్రల్లో నటించారు. ఓ వైపు ఫ్యామిలీ ఎంటర్టైనర్గా, మరోవైపు క్రైమ్ కామెడీగా వస్తున్న ఈ చిత్రం ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.
