మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, బుచ్చిబాబు సానా కాంబోలో వస్తున్న మోస్ట్ యాంటిసిపేటెడ్ ఫిలిం ‘పెద్ది’ ఇప్పటికే సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. ఈ సినిమా నుంచి విడుదలైన టీజర్, ఫస్ట్ సింగిల్ అంచనాలను ఆకాశానికి తీసుకెళ్లగా, తాజాగా చిత్ర యూనిట్ మరో ఆసక్తికర అప్‌డేట్‌ను పంచుకుంది. వెర్సటైల్ యాక్టర్ జగపతి బాబు (Jagapathi Babu) పుట్టినరోజును పురస్కరించుకుని ఆయనకు శుభాకాంక్షలు తెలుపుతూ మేకర్స్ ఒక క్రేజీ పోస్ట్‌ను సోషల్ మీడియాలో షేర్ చేశారు.
ఈ సినిమాలో జగపతి బాబు ‘అప్పలసూరి’ అనే ఊరమాస్ పాత్రలో నటిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఆయన ఫస్ట్ లుక్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. గుర్తుపట్టలేనంతగా ఉన్న ఆయన మేకోవర్ సినిమాపై క్యూరియాసిటీని పెంచింది. తాజాగా, షూటింగ్ సెట్‌లో దర్శకుడు బుచ్చిబాబు సానా.. జగపతి బాబుకు ఒక కీలకమైన సీన్ వివరిస్తున్న ఫోటోను టీమ్ విడుదల చేసింది. ఈ చిత్రంలో అప్పలసూరి పాత్రలో జగ్గుభాయ్ నటన సినిమాకే మేజర్ హైలైట్ కాబోతుందని టీమ్ భరోసా ఇచ్చింది.
జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ పాన్-ఇండియా ప్రాజెక్టును వృద్ధి సినిమాస్ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తోంది. దివ్యేందు శర్మ, బొమన్ ఇరానీ, సత్య వంటి స్టార్స్ ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఆస్కార్ విజేత ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్న ఈ విలేజ్ స్పోర్ట్స్ డ్రామా ఏప్రిల్ 30, 2026న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో సందడి చేయనుంది.
