ఏ సినిమాకి అయినా హైప్ బిల్డ్ కావాలి అంటే వారు అందించే కంటెంట్ బట్టే ఉంటుంది. అలా లేటెస్ట్ గా మంచి బజ్ ని రేకెత్తించిన లేటెస్ట్ చిత్రమే ‘నాగ బంధం'(Naga Bandham). చెప్పుకోడానికి భారీ స్టార్డం ఉన్న హీరో కాదు కేవలం ఒక్క సినిమా తోనే టాలెంట్ చూపించిన విరాట్ కర్ణ ఇందులో నటిస్తున్నాడు. తన మొదటి సినిమా కూడా అంతగా రాణించలేదు.
అయినప్పటికీ మేకర్స్ భారీ బడ్జెట్ పెట్టి చేస్తున్న ఈ ‘నాగ బంధం’ కోసం చాలామంది మాట్లాడుకుంటున్నారు. అందుకు ప్రధాన కారణం ఈ సినిమా తాలూకా టీజర్. నేడు మహా శివ రాత్రి కానుకగా రిలీజ్ కి తీసుకొచ్చిన టీజర్ చూసి అంతా సర్ప్రైజ్ అవుతున్నారు. భారీ విజువల్స్ అండ్ యాక్షన్ తో ఊహించని స్కేల్ ని మేకర్స్ పరిచయం చేశారు.
దీనితో ఈ టీజర్ చూసిన తర్వాత మన తెలుగు ఆడియెన్స్ నుంచి సినీ వర్గాల్లో కూడా మంచి రెస్పాన్స్ వస్తుంది. మరి ఇదే రీతిలో సినిమా ఆద్యంతం కంటెంట్ కూడా ఆకట్టుకునేలా ఉంటే బాక్సాఫీస్ దగ్గర ఈ చిత్రానికి మంచి నంబర్స్ వచ్చే అవకాశం ఉంది. ఇక ఈ చిత్రానికి అభిషేక్ నామా దర్శకత్వం వహిస్తుండగా ఎన్ ఐ కే స్టూడియోస్, అభిషేక్ పిక్చర్స్ వారు భారీ వ్యయంతో ఈ సినిమాని నిర్మాణం వహిస్తున్నారు.
టీజర్ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి
