కన్నడ స్టార్ హీరో యశ్ నటిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘టాక్సిక్’ (Toxic)ఇప్పటికే ప్రేక్షకుల్లో భారీ అంచనాలు క్రియేట్ చేసింది. గీతూ మోహన్ దాస్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం 2026 మార్చి 19న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. ఈ సినిమాకు సంబంధించిన కథ ఇదేనంటూ ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఫార్ ఫిల్మ్స్ వెబ్సైట్లో కనిపించిన సమాచారం ప్రకారం.. ఈ సినిమా 1940 నుండి 1970 మధ్య కాలంలో గోవా నేపథ్యంలో సాగే పీరియడ్ యాక్షన్ థ్రిల్లర్ అని తెలుస్తోంది. భయం, హింస మరియు ద్రోహంతో నిర్మించబడిన ఒక క్రైమ్ సామ్రాజ్యం ఎలా ఎదిగింది అనే కథాంశంతో ఈ సినిమా ఉండబోతుందని తెలుస్తోంది. ఇందులో హీరో పాత్ర మానసిక సంఘర్షణల చుట్టూ కథ తిరుగుతుందని సమాచారం. అయితే, దీనిపై చిత్ర బృందం నుంచి ఇంకా అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
ఈ మూవీలో కియారా అద్వానీ, రుక్మిణి వసంత్, నయనతార, హుమా ఖురేషి మరియు తారా సుతారియా వంటి స్టార్ హీరోయిన్లు నటిస్తున్నారు. కేవీఎన్ ప్రొడక్షన్స్ మరియు మాన్స్టర్ మైండ్ క్రియేషన్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా రవి బస్రూర్ సంగీతాన్ని అందిస్తున్నారు.
