కన్నడ రాకింగ్ యష్ ఇప్పుడు వరల్డ్ లెవెల్ ప్రాజెక్ట్ లతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. రీసెంట్ గానే రామాయణ ట్రైలర్ లో రావణ పాత్రలో కనిపించి మెప్పించిన యష్ నుంచి దీనికంటే ముందు మరో భారీ ప్రాజెక్ట్ ‘టాక్సిక్’ రాబోతుంది. దర్శకురాలు గీతూ మోహన్ దాస్ తెరకెక్కించిన ఈ సాలిడ్ యాక్షన్ డ్రామా నుంచి మేకర్స్ ఇప్పుడు బిగ్ అప్డేట్ అందించారు.
పూర్తిగా బ్లాక్ అండ్ వైట్ లో ఉన్న ఒక వర్షపు పోస్టర్ ని వదిలి ఈ సినిమా ట్రైలర్ ని ఈ ఆగష్టు 8న గ్రాండ్ గా లాంచ్ చేస్తున్నట్టుగా కన్ఫర్మ్ చేశారు. సో రామాయణ తర్వాత టాక్సిక్ తో మరోసారి యష్ తన డామినేషన్ ని చూపించనున్నాడని చెప్పవచ్చు. ఆల్రెడీ రామాయణ ట్రైలర్ తో తన ప్రెజెన్స్, యాక్షన్ కి మంచి మార్కులు పడ్డాయి.
ఇక ఈ టాక్సిక్ లో తన విధ్వంసం ఎలా ఉంటుందో చూడాల్సిందే. ఈ చిత్రానికి రవి బసృర్ సంగీతం అందిస్తుండగా యష్, కే వి ఎన్ ప్రొడక్షన్స్ వారు నిర్మాణం వహిస్తున్నారు. అలాగే ఈ ఆగష్టు 26న సినిమా గ్రాండ్ గా విడుదలకు రాబోతుంది.
