ఆరా ఆఫ్ ఉస్తాద్ ప్రోమో.. డిఎస్పీ మాస్ కొట్టుడుతో ‘గబ్బర్ సింగ్’ రోజులు వెనక్కి

UBS Second Single

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ లేటెస్ట్ గా నటిస్తున్న అవైటెడ్ చిత్రమే “ఉస్తాద్ భగత్ సింగ్”. దర్శకుడు హరీష్ శంకర్ తెరకెక్కిస్తున్న ఈ సాలిడ్ ప్రాజెక్ట్ నుంచి మొదటి సాంగ్ ఇప్పుడు సోషల్ మీడియాలో హవా చూపిస్తుంది. ఇక నెక్స్ట్ సాంగ్ గా ఆరా ఆఫ్ ఉస్తాద్ అంటూ అనౌన్స్ చేశారు.

లేటెస్ట్ గా దీని తాలూకా ప్రోమోని కూడా విడుదల చేశారు. అయితే ఈ ప్రోమోలో మరీ ఎక్కువ డీటెయిల్స్ కూడా లేవు కానీ సంగీత దర్శకుడు దేవిశ్రీప్రసాద్ మాస్ కొట్టుడు మాత్రం మళ్ళీ పవన్ కళ్యాణ్ అభిమానులకి గబ్బర్ సింగ్ రోజులు వెనక్కి తెచ్చేలా కనిపిస్తుంది. అలాగే పవన్ చూపించిన కొన్ని విజువల్స్ కూడా హరీష్ శంకర్ మార్క్ ఫ్లేవర్ లో కనిపిస్తున్నాయి.

దీనితో ఫ్యాన్స్ ఇప్పుడు ఈ ఫుల్ సాంగ్ కోసం మరింత ఎగ్జైటెడ్ గా ఏడీర్ చూస్తున్నారు. ఇక ఈ సాంగ్ ని మేకర్స్ ఈ ఫిబ్రవరి 22న రిలీజ్ కి తీసుకొస్తున్నారు. ఇక ఈ సినిమాని మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణం వహిస్తుండగా ఈ మార్చ్ 26న గ్రాండ్ గా రిలీజ్ కి రాబోతుంది.

ప్రోమో కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి

Exit mobile version