RC17: ఈ విషయంలో బిగ్ సస్పెన్స్ గా చరణ్, సుకుమార్ ల భారీ ప్రాజెక్ట్!

rc17

ప్రస్తుతం మన టాలీవుడ్ నుంచి రానున్న నెక్స్ట్ భారీ చిత్రాల్లో మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా దర్శకుడు సుకుమార్ కలయికలో చేయనున్న సెన్సేషనల్ ప్రాజెక్ట్ కూడా ఒకటి. చరణ్ కెరీర్ 17వ సినిమాగా అనౌన్స్ చేసిన ఈ చిత్రం అతి త్వరలోనే సెట్స్ మీదకు వెళ్లనుంది. అయితే ఈ సినిమాకి చాలా విషయాల్లో క్లారిటీ ఉంది కానీ ఒక్క విషయంలో మాత్రం ప్రస్తుతం బిగ్ సస్పెన్స్ నెలకొంది.

అదే ఈ చిత్రానికి సంగీతం ఎవరు అనేది? దర్శకుడు సుకుమార్ ఇప్పటివరకు దేవిశ్రీ ప్రసాద్ లేకుండా సినిమా చేసింది లేదు. ఇద్దరి కాంబినేషన్ బస్టర్ అని అందరికీ తెలిసిందే. కానీ ఇప్పుడు చేయనున్న సినిమా నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ కి దేవిశ్రీ ప్రసాద్ కి గత కొన్నాళ్ల నుంచి దూరం ఉన్న సంగతి తెలిసిందే.

దీనితో ఈ ప్రాజెక్ట్ కి సంగీత దర్శకుడు ఎవరు అనేది బిగ్ సస్పెన్స్ గా మారింది. ఆ మధ్య ‘ధురంధర్’ సంగీత దర్శకుడు శశ్వత్ సచ్ దేవ్ వర్క్ చేస్తాడనే రూమర్స్ కూడా వచ్చాయి. అయితే ఈ ప్రాజెక్ట్ పీరియాడిక్ జానర్ లో కాకుండా ట్రెండీగా ఉంటుంది అనే టాక్ ఉంది. సో శశ్వత్ కూడా మంచి ఛాయిస్ అని చెప్పొచ్చు. సో సుకుమార్ ఏం ప్లాన్ చేసారో చూడాలి.

Exit mobile version