నార్త్ మార్కెట్ లో ‘టాక్సిక్’ని తక్కువ అంచనా వేస్తున్నారా?

Toxic 2

ఈ మార్చ్ నెలలో జరగనున్న బిగ్గెస్ట్ బాక్సాఫీస్ క్లాష్ ధురంధర్ 2 వర్సెస్ టాక్సిక్ సినిమా కోసం ఎప్పుడు నుంచో చర్చ నడుస్తుంది. అయితే ఈ కాంబినేషన్ క్లాష్ మొదట ఎవరూ ఊహించలేదు. తర్వాత ధురంధర్ 1 వచ్చి భారీ విజయం సాధించడం ఆ తర్వాత ఆల్రెడీ యష్ టాక్సిక్ ఉన్న డేట్ లోనే అనౌన్స్ చేయడంతో మరింత రసవత్తరంగా మారింది.

అయితే ధురంధర్ 2 తో టాక్సిక్ చిత్రానికి క్లాష్ చాలా మంది టాక్సిక్ కే ఇబ్బంది అనుకుంటున్నారు. మెయిన్ గా నార్త్ మార్కెట్ లో.. కానీ టాక్సిక్ చిత్రానికి నార్త్ మార్కెట్ లో మరీ తేలిగ్గా తీసేసే ఛాన్స్ లేదట. మేకర్స్ పక్కాగా హిందీ రిలీజ్ కి ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తుంది. మెయిన్ గా కన్నడ మినహాయిస్తే, తెలుగు, హిందీ మార్కెట్ లలో భారీ ఎత్తున రిలీజ్ చేయడానికే చూస్తున్నారట.

ధురంధర్ 2 ఉన్నప్పటికీ సాధ్యమైనన్ని ఎక్కువ స్క్రీన్స్ లోనే టాక్సిక్ పడుతుంది అని తెలుస్తుంది. స్క్రీన్స్ లాక్ చేసుకున్నప్పటికీ మిగతా అంతా మాత్రం టాక్ మీదే ఆధారపడి ఉంటుంది. సో ఈ సినిమాని దర్శకురాలు గీతూ మోహన్ దాస్ ఎలా తెరకెక్కించారో చూడాలి.

Exit mobile version