ప్రస్తుతం మన టాలీవుడ్ ఆడియెన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న అవైటెడ్ చిత్రాల్లో నాచురల్ స్టార్ నాని హీరోగా కయాదు లోహర్ హీరోయిన్ గా దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కలయికలో వస్తున్న మాసివ్ ప్రాజెక్ట్ ‘ది ప్యారడైజ్’ కూడా ఒకటి. భారీ హైప్ ఉన్న ఈ సినిమా నుంచి మేకర్స్ ఫస్ట్ టీజర్ ని ఈ ఆగస్ట్ 6న గ్రాండ్ గా విడుదల చేస్తున్న సంగతి తెలిసిందే.
అయితే ఈ టీజర్ పై లేటెస్ట్ గా దర్శకుడు శ్రీకాంత్ ఇచ్చిన స్టేట్మెంట్ కొత్త ఊపు తీసుకొచ్చింది. తాను తాజాగా హాజరైన ఓ సినిమా ఈవెంట్ లో మాట్లాడుతూ ఈ ఆగస్ట్ 6న వచ్చే టీజర్ ‘తగలబడుతుంది’ అంటూ ఇచ్చిన స్టేట్మెంట్ వైరల్ గా మారింది. దీనితో ఈ రానున్న టీజర్ పట్ల అంచనాలు మరింత పెరిగిపోయాయి. సో ఈ 6న వచ్చే టీజర్ ఎలా ఉంటుందో చూడాల్సిందే. ఇక ఈ చిత్రానికి అనిరుద్ సంగీతం అందిస్తుండగా ఎస్ ఎల్ వి సినిమాస్ వారు నిర్మాణం వహిస్తున్నారు.
'Thagalapadathadi' is the code word 🔥🔥
August 6th… we are coming…
Our madman @@odela_srikanth about #TheParadiseTeaser 💥💥💥#TheParadise pic.twitter.com/ICbMx9CS3u
— THE PARADISE (@TheParadiseOffl) August 2, 2026
