అక్కినేని వారి యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో నాగ చైతన్య అక్కినేని హీరోగా నటిస్తున్న లేటెస్ట్ భారీ చిత్రమే ‘వృషకర్మ’. సాలిడ్ సూపర్ నాచురల్ థ్రిల్లర్ హిట్ చిత్రం విరూపాక్ష దర్శకుడు కార్తీక్ వర్మ దండు తెరకెక్కిస్తున్న ఈ భారీ సినిమా కూడా మంచి థ్రిల్లర్ జానర్ లోనే వస్తుంది. అయితే ఈ సినిమా గ్లింప్స్ కి ఇప్పుడు మేకర్స్ డేట్ ని ఫిక్స్ చేసేసారు.
నాగ చైతన్యపై ఒక సాలిడ్ పోస్టర్ ని దింపి ఈ సినిమా తాలూకా గ్లింప్స్ ని ఈ మార్చ్ 5న విడుదల చేస్తున్నట్టు ఖరారు చేశారు. ఇక ఈ పోస్టర్ లో నాగ చైతన్య ఇంటెన్స్ లుక్ లో మంచి అడ్వెంచర్ యాక్షన్ మోడ్ లో కనిపిస్తున్నాడు. సో ఫ్యాన్స్ కి థియేటర్స్ లో మంచి థ్రిల్ రైడ్ ని తాను అందిస్తారని చెప్పొచ్చు. ఇక ఈ సినిమాలో హీరోయిన్ గా మీనాక్షి చౌదరి నటిస్తుండగా అజనీష్ లోకనాథ్ సంగీతం అందిస్తున్నాడు. అలాగే సుకుమార్ రైటింగ్స్ ఇంకా శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర వారు భారీ బడ్జెట్ తోనే ఈ సినిమాని నిర్మాణం వహిస్తున్నారు.
We open the world of #VRUSHAKARMA with a glimpse on March 5th, 2026 .@karthikdandu86 and team have put together something super exciting . #VrushakarmaGlimpse @Meenakshiioffl @BvsnP @aryasukku #SparshShrivastava @AJANEESHB #RagulDHerian @Srinagendra_Art @NavinNooli… pic.twitter.com/tHzhsVJkew
— chaitanya akkineni (@chay_akkineni) February 25, 2026
