షూటింగ్ స్పాట్‌లో శేఖర్ మాస్టర్‌కు సర్‌ప్రైజ్ ఇచ్చిన ‘బొమ్మ హిట్’ చిత్ర యూనిట్

Bomma-Hit

ప్రముఖ కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్‌కు ‘బొమ్మ హిట్’ చిత్ర బృందం ఘన సత్కారం చేసింది. ఇటీవల జరిగిన 6వ ఫిల్మ్‌ఫేర్ అవార్డుల వేడుకలో ఆయన ఉత్తమ కొరియోగ్రాఫర్‌గా అవార్డును సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. ఈ అరుదైన గౌరవం దక్కిన సందర్భంగా షూటింగ్ లొకేషన్‌లోనే కేక్ కట్ చేసి, శేఖర్ మాస్టర్‌కు చిత్ర యూనిట్ ప్రత్యేకంగా అభినందనలు తెలిపింది.

ప్రస్తుతం శేఖర్ మాస్టర్ ‘బొమ్మ హిట్’ సినిమాకు నృత్య దర్శకుడిగా వ్యవహరిస్తున్నారు. అవార్డు సాధించిన ఆనందాన్ని ఆయనతో పంచుకుంటూ చిత్ర బృందం ఈ వేడుకను నిర్వహించింది. ఈ సత్కార కార్యక్రమంలో చిత్ర హీరో అభినవ్, హీరోయిన్ వ్రజన పాండ్య, నటులు హైపర్ ఆది, టేస్టీ తేజ, లిఖిత పాల్గొన్నారు. అలాగే, దర్శకుడు రాజేష్ గడ్డం, నిర్మాత గుర్రాల శ్రీధర్, సినిమాటోగ్రాఫర్ మల్లికార్జున్ తదితరులు శేఖర్ మాస్టర్‌ను సత్కరించి తమ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు.

Exit mobile version