కొత్త రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకున్న అడివి శేష్ క్రైమ్ యాక్షన్ ‘డెకాయిట్’

Dacoit

మన టాలీవుడ్ యంగ్ అండ్ ప్రామిసింగ్ హీరో అడివి శేష్ హీరోగా మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా దర్శకుడు షానియల్ డియో తెరకెక్కిస్తున్న క్రైమ్ థ్రిల్లర్ కం లవ్ స్టోరీ చిత్రమే ‘డెకాయిట్’. మొన్నామధ్య వచ్చిన గ్లింప్స్ తోనే సాలిడ్ బజ్ ని ఈ చిత్రం అందుకోగా ఇక ఈ చిత్రాన్ని భారీ చిత్రాలు ధురంధర్ 2 అలాగే టాక్సిక్ లాంటి సినిమాలతో పోటీకి ముందు సెట్ చేశారు. కానీ ఈ క్లాష్ లో తర్వాత తప్పుకున్నట్టు కూడా హింట్ ఇచ్చారు.

ఇక ఫైనల్ గా లేటెస్ట్ గా వచ్చిన ఫీల్ గుడ్ ఫస్ట్ సింగిల్ తో రిలీజ్ ని వాయిదా వేసినట్టు కన్ఫర్మ్ చేశారు. ఇక కొత్త డేట్ గా అయితే ఈ ఏప్రిల్ 10న సినిమాని పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ చేస్తున్నట్టు కన్ఫర్మ్ చేశారు. ఇక ఈ సినిమాలో అనురాగ్ కశ్యప్ విలన్ గా నటిస్తుండగా ఈ సినిమా తోనే తాను టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నారు. అలాగే భీమ్స్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తుండగా సుప్రియ యార్లగడ్డ, సునైల్ నారంగ్ నిర్మాణం వహిస్తున్నారు.

Exit mobile version