టాలీవుడ్ స్టార్ హీరోలు మహేష్ బాబు, అల్లు అర్జున్, రవితేజ, విజయ్ దేవరకొండ మల్టీప్లెక్స్ వ్యాపారంలో మంచి లాభాలు ఆర్జిస్తున్నారు. ఈ క్రమంలో ఇప్పుడు ఎన్టీఆర్ కూడా హైదరాబాద్లో మల్టీప్లెక్స్ నిర్మిస్తున్నారంటూ వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.
అయితే ఇందులో ఎలాంటి నిజం లేదు. ఎన్టీఆర్ ప్రస్తుతం ఎలాంటి వ్యాపారాల్లోనూ పెట్టుబడి పెట్టే ఆలోచనలో లేరని తేలింది. ప్రస్తుతం ఎన్టీఆర్ దృష్టి అంతా సినిమాలపైనే ఉంది.
ఆయన ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ‘డ్రాగన్’ చిత్రంలో నటిస్తున్నారు. ఇటీవల షూటింగ్లో గాయపడటంతో ఆయన ఆరు వారాల విశ్రాంతిలో ఉన్నారు. 2027 జూన్లో రానున్న ఈ చిత్రం పూర్తయ్యాక, త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కే భారీ పౌరాణిక చిత్రంలో ఎన్టీఆర్ నటించనున్నారు.
