నటుడు సోనూసూద్ ఆపదలో ఉన్నవారికి సహాయం చేయడంలో ఎప్పుడూ ముందు ఉంటారు. ఐతే, తాజాగా సోనూసూద్ మరోసారి తన ఉదారతను చాటుకున్నారు. ప్రస్తుతం నెలకొన్న యుద్ధ పరిస్థితుల (విమాన సర్వీసుల రద్దు) కారణంగా దుబాయ్లో చిక్కుకుపోయిన ప్రయాణికుల కోసం సాయం చేయబోతున్నట్లు సోనూసూద్ చెప్పారు. సోనూసూద్ ఇంకా మాట్లాడుతూ.. అక్కడ ఇబ్బందిపడుతున్న వారికి ఉచితంగా వసతి కల్పించనున్నట్లు తెలిపారు.
సోనూసూద్ మాట్లాడుతూ.. ‘ఎలాంటి షరతులు లేవని.. ఏ దేశస్థులైనా ఉచితంగా బస చేయవచ్చని, ఇలాంటి సమయంలో మానవత్వం మాత్రమే ముఖ్యమని సోనూసూద్ చెప్పుకొచ్చారు. ఇబ్బందుల్లో ఉన్నవారు తనకు ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేస్తే తన టీమ్ వారిని సంప్రదిస్తుందని సోనూసూద్ చెప్పారు. కాగా కరోనా సమయంలో లక్షల మంది వలస కార్మికులను సోనూసూద్ స్వస్థలాలకు చేర్చిన సంగతి తెలిసిందే.
