‘నాగబంధం’ మొదటి సింగిల్ రిలీజ్ అప్పుడే !

Nagabandham

పెద కాపు సినిమాతో టాలీవుడ్ కి పరిచయం అయిన యంగ్‌ హీరో విరాట్‌ కర్ణ అవైటెడ్ పాన్‌-ఇండియా చిత్రమే “నాగబంధం”. భారీ సినిమాల నిర్మాత అభిషేక్‌ నామా దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం గ్రాండ్‌ స్కేల్‌లో రూపొందుతోంది. కాగా ఇప్పటికే రిలీజ్ అయిన ఈ సినిమా టీజర్‌కు బలమైన స్పందన వచ్చింది. ఐతే, ఇప్పుడు నిర్మాతలు సినిమా మ్యూజిక్ ప్రమోషన్‌లను కూడా ప్రారంభించారు. ఈ సినిమా మొదటి సింగిల్, “నమో రే”, మార్చి 15, 2026న ఉదయం 11:11 గంటలకు విడుదల కానుంది.

ఇక ఈ సినిమా కథ విషయానికి వస్తే.. పురాతనమైన రహస్యాలు, నాగబంధం సాంప్రదాయంతో ముడిపడిన కథతో ఈ సినిమా సాగనుంది. అన్నట్టు పద్మనాభస్వామి, పూరీ జగన్నాథ దేవాలయాల వద్ద ఇటీవల కనుగొనబడిన గుప్త నిధుల నుంచి ప్రేరణ పొంది, ఆధ్యాత్మిక సాహసోపేతమైన ఇతివృత్తాలతో ఈ సినిమా ఉండబోతుంది. ఈ చిత్రంలో మురళి శర్మ, జయ ప్రకాష్, బిఎస్ అవినాష్ మరియు అనసూయ భరద్వాజ్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

Exit mobile version