గోపీచంద్ భారీ చిత్రంలో ‘పెళ్లి చూపులు’ బ్యూటీ! ఇంటెన్స్ ఫస్ట్ లుక్ విడుదల

Gopichand33

మన టాలీవుడ్ మ్యాచో స్టార్ గోపీచంద్ హీరోగా ఇప్పుడు తన అక్రర్ కెరీర్ 33వ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఘాజీ, అంతరిక్షం లాంటి వినూత్న సబ్జెక్టులతో తెలుగు ఆడియెన్స్ కి థ్రిల్ అందించిన యంగ్ అండ్ టాలెంటెడ్ దర్శకుడు సంకల్ప్ రెడ్డి తెరకెక్కిస్తున్న ఈ భారీ చిత్రం ఊహించని స్కేల్ లో నిర్మితం అవుతుంది. ఇక లేటెస్ట్ గా మేకర్స్ ఓ ఇంట్రెస్టింగ్ అప్డేట్ ని అయితే అందించారు.

దీనితో ఈ సినిమాలో పెళ్లి చూపులు బ్యూటీ రీతూ వర్మ హీరోయిన్ గా నటిస్తున్నట్టు ఓ ఫస్ట్ లుక్ పోస్టర్ ని ఇప్పుడు వదిలారు. విల్లు, బాణం పట్టుకొని లక్ష్యాన్ని గురిపెట్టి కనిపిస్తున్న యువతిగా ఓ ఇంటెన్స్ పోస్టర్ ని మేకర్స్ వదిలారు. అలాగే ఈ సినిమాలో ఆమె సత్యవతి అనే పాత్రలో నటిస్తున్నట్టు కూడా రివీల్ చేశారు. మరి ఈ సినిమాలో తన పెర్ఫామెన్స్ ఎలా ఉంటుందో చూడాల్సిందే. ఇక ఈ చిత్రానికి శ్రీనివాస చిట్టూరి నిర్మాణం వహిస్తుండగా మేకర్స్ అతి త్వరలోనే రిలీజ్ డేట్ ని ప్రకటించనున్నారు.

Exit mobile version