మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా ఇప్పుడు పెద్ది అనే భారీ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. మంచి అంచనాలు ఉన్న ఈ సినిమా తర్వాత చరణ్ తన కెరీర్ 17వ సినిమాని సెన్సేషనల్ దర్శకుడు సుకుమార్ తో తాను చేయనున్నాడు. ఇది కూడా ఎంతో గ్రాండ్ గా తెరకెక్కనుండగా ఈ సినిమాపై ఊహించని లెవెల్ హైప్ ఉంది. ఇక ఈ ప్రాజెక్ట్ ఎప్పుడెప్పుడు మొదలవుతుందా అని అభిమానులు కూడా ఎదురు చూస్తున్నారు.
ఇక దీనిపైనే క్రేజీ బజ్ ఇప్పుడు వినిపిస్తుంది. ఈ ప్రాజెక్ట్ పై ఈ మార్చ్ 27 చరణ్ పుట్టినరోజు కానుకగా సాలిడ్ అప్డేట్ రానుందట. ఈ సినిమా తాలూకా కాన్సెప్ట్ గాని లేదా ప్రీ లుక్ పోస్టర్ కూడా వచ్చే ఛాన్స్ ఉన్నట్టు తెలుస్తుంది. అంతే కాకుండా ఆ సినిమా షూట్ పై కూడా అప్పుడే క్లారిటీ ఉంటుందని టాక్. సో ఇది మాత్రం చరణ్, మెగా అభిమానులకి బిగ్ న్యూస్ అనే చెప్పవచ్చు. ఇక ఈ చిత్రానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ రావాల్సి ఉంది.
