భారీ ఓపెనింగ్స్ తో మొదలైన ‘కాంచన’ రీరిలీజ్!

kanchana

మల్టీ టాలెంటెడ్ హీరో రాఘవ లారెన్స్ హీరోగా దర్శకునిగా చేసిన సాలిడ్ హారర్ థ్రిల్లర్ చిత్రమే “కాంచన”. 2011లో విడుదల అయ్యిన ఈ సినిమా అప్పట్లోనే ఎంత సంచలనం సెట్ చేసిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. మళ్ళీ ఇన్నాళ్ల తర్వాత రీరిలీజ్ కి వచ్చిన ఈ సినిమా మన తెలుగు రాష్ట్రాల్లో భారీ ఓపెనింగ్స్ ని సొంతం చేసుకుంది. వర్కింగ్ రోజునే విడుదల అయ్యినప్పటికీ ఇతర నోటెడ్ సినిమాలు థియేటర్స్ లో లేనందున కాంచన కి మరింత ప్లస్ అయ్యింది.

ఇలా మొదటి రోజు ఈ సినిమా 3 కోట్లకి పైగా గ్రాస్ ని కొల్లగొట్టి మన తెలుగు సినిమాల రేంజ్ లోనే సెన్సేషనల్ రెస్పాన్స్ ని నమోదు చేసింది. మొత్తం 3.35 కోట్ల గ్రాస్ తో సాలిడ్ వీకెండ్ పై ఈ సినిమా కన్నేసింది. మరి ఫుల్ రన్ లో ఈ సినిమా ఎక్కడ వరకు వెళ్లి ఆగుతుందో చూడాలి. ఇక ఈ చిత్రానికి థమన్ సంగీతం అందించగా లక్ష్మి రాయ్ హీరోయిన్ గా నటించింది. అలాగే బెల్లంకొండ సురేష్ నిర్మాణం వహించారు.

Exit mobile version