కోలీవుడ్ నటుడు సూర్య హీరోగా మమితా బైజు హీరోయిన్ గా దర్శకుడు వెంకీ అట్లూరి తెరకెక్కిస్తున్న అవైటెడ్ క్లీన్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ చిత్రమే ‘విశ్వనాథ్ & సన్స్’. రీసెంట్ గా ఫస్ట్ లుక్ మరియు టైటిల్ రివీల్ తో మంచి బజ్ ని ఈ సినిమా అందుకుంది. ఇక ఈ సినిమా నుంచి మేకర్స్ మరో సాలిడ్ అప్డేట్ అందించారు. ఈ సినిమా తాలూకా టీజర్ రిలీజ్ కి డేట్ మరియు సమయాన్ని ఖరారు చేసేసారు.
ఈ మార్చ్ 16 న సాయంత్రం 4 గంటల 6 నిమిషాలకి విడుదల చేస్తున్నట్టు తెలిపారు. ఓ ప్రీ లుక్ పోస్టర్ లో సూర్య, మమితా బైజు లు నడుస్తూ కనిపిస్తున్నట్టు కనిపిస్తున్నారు. మరి ఈ టీజర్ తో చాలామంది ఈ సినిమా పట్ల మంచి క్లారిటీ రావచ్చు. ఆల్రెడీ సాలిడ్ ట్రాక్ రికార్డు వెంకీ అట్లూరికి సితార వారికి ఉంది. దీనితో ఈ సినిమా కోసం తెలుగుతో పాటుగా తమిళ ఆడియెన్స్ కూడా అంతే ఎగ్జైటెడ్ గా ఎదురు చూస్తున్నారు. మరి ఈ సినిమాకి జీవి ప్రకాష్ సంగీతం అందిస్తుండగా ఈ జూలైలో సినిమాని రిలీజ్ కి తీసుకొస్తున్నారు.
A journey filled with heart. ❤️
The teaser of #VishwanathAndSons is on its way.🥳Sanjay Vishwanath arrives on March 16th @ 04:06 PM! 😎
In cinemas from this JULY 2026. 🤩@Suriya_offl #VenkyAtluri @_mamithabaiju @realradikaa @TandonRaveena @gvprakash @vamsi84 @NavinNooli… pic.twitter.com/FKoOht3Oz0
— Sithara Entertainments (@SitharaEnts) March 14, 2026
