ఈ ఉగాది కానుకగా థియేటర్స్ లో వస్తున్న అవైటెడ్ చిత్రమే ఉస్తాద్ భగత్ సింగ్. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా శ్రీలీల, రాశి ఖన్నా హీరోయిన్స్ గా దర్శకుడు హరీష్ శంకర్ తెరకెక్కించిన ఈ సినిమా కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక లేటెస్ట్ గానే ఈ సినిమా గ్రాండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా అయ్యింది. ఇదిలా ఉండగా యూఎస్ మార్కెట్ లో ఉస్తాద్ భగత్ సింగ్ డీసెంట్ గా నిలుస్తూ కొనసాగుతుంది.
ఇటీవల 2 లక్షల డాలర్లు మార్క్ ని దాటిన ఈ సినిమా ఇప్పుడు 10 వేల టికెట్స్ పైగా సేల్ చేసుకుంది. ఇలా ప్రస్తుతం అయితే మంచి బుకింగ్స్ తో ఈ సినిమా దూసుకెళ్తుంది. మరి ఈ కొన్ని రోజుల్లో పెద్ద జంప్ ఏమన్నా ఉంటుందో లేదో చూడాలి. ఇక ఈ సినిమాకి దేవిశ్రీప్రసాద్ సంగీతం అందించారు అలాగే మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణం వహించారు.
