ఆ ఫార్ములాను బ్రేక్ చేయబోతున్న హరీష్ శంకర్ !

Ustaad Bhagat Singh

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా దర్శకుడు హరీష్ శంకర్ దర్శకత్వంలో రాబోతున్న క్రేజీ సినిమా “ఉస్తాద్ భగత్ సింగ్”. ఐతే, హరీష్ శంకర్.. ఈ సినిమాతో టాలీవుడ్ లో రెగ్యులర్ హిట్ ఫార్ములాను బ్రేక్ చేయబోతున్నారు. ఒక కమర్షియల్ సినిమా క్లైమాక్స్ లో, సహజంగానే హీరో.. విలన్ ని ఓడించి, అతన్ని అంతం చేస్తాడు. అయితే, ఉస్తాద్ భగత్ సింగ్ లో మాత్రం ఆ రెగ్యులర్ క్లైమాక్స్ ను బ్రేక్ చేశానని హరీష్ శంకర్ చెప్పారు.

దీంతో.. ఈ సినిమా క్లైమాక్స్ ఎలా ఉంటుందో.. ?, చివరికి ఏమి జరుగుతుందో అని ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తారని ఆయన తెలిపారు. ఇంతకీ, ఈ క్లైమాక్స్ ఎలా ఉండబోతుంది అనేది ప్రస్తుతానికి సస్పెన్సే. ఇక ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ ఓ పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటిస్తుండగా అందాల భామలు శ్రీలీల, రాశి ఖన్నా హీరోయిన్లుగా నటిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ ప్రొడ్యూస్ చేస్తున్న ఈ సినిమాను ఉగాది స్పెషల్ గా గ్రాండ్ రిలీజ్ కాబోతుంది.

Exit mobile version