ఇప్పుడు అంతా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న సెన్సేషనల్ సీక్వెల్ చిత్రమే “ధురంధర్ 2”. టాలెంటెడ్ హీరో రణ్వీర్ సింగ్ హీరోగా దర్శకుడు ఆదిత్య ధర్ తెరకెక్కించిన ఈ సాలిడ్ సీక్వెల్ చిత్రం పట్ల నెక్స్ట్ లెవెల్ అంచనాలు సెట్ అయ్యాయి. ఇక ఈ సినిమా కోసం చూస్తున్న అభిమానుల్లో చివరి నిమిషంలో గందరగోళం నెలకొంది.
ఎంతో ముందే ఈ సినిమా ప్రీమియర్స్ ని ప్లాన్ చేసిన మేకర్స్ చివరికి వచ్చే సరికి కే డి ఎం సమస్యలతో అన్ని భాషల్లో కూడా ప్రీమియర్స్ ని క్యాన్సిల్ చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇదిలా ఉండగా పార్ట్ 1 కి చేసిన మిస్టేక్ నే మళ్ళీ పార్ట్ 2 కి కూడా మేకర్స్ చేసినట్టు తెలుస్తుంది. ఎంత డబ్బింగ్ లో విడుదల చేస్తున్నప్పటికీ చాలా మంది ఒరిజినాలిటీ కావాలని చెప్పి హిందీలోనే చూసేందుకు కూడా మొగ్గు చూపుతున్నారు.
హిందీ వచ్చినవారికి అయితే ఎలాంటి సమస్య లేదు కానీ హిందీలోనే వెళ్లి ఇంగ్లీష్ సబ్ టైటిల్స్ తో చూద్దాం అనుకునేవారికి పార్ట్ 1 తో పెద్ద సమస్య వచ్చి పడింది. పార్ట్ 1 సృష్టిస్తున్న సంచలనం చూసి తెలుగు, తమిళ్ ఇలా ఇతర ముఖ్య భాషల్లో థియేటర్స్ లో జనం చూసారు. చాలామంది సింగిల్ స్క్రీన్స్ లో సహా మల్టీప్లెక్స్ లలో కూడా సబ్ టైటిల్స్ ఉంటాయి అనే అనుకున్నారు కానీ మేకర్స్ వాటిని పొందు పరచకపోవడం మైనస్ గా మారింది.
ఇలానే పార్ట్ 2 కి కూడా చాలామంది ప్లాన్ చేసుకున్నారు. కానీ ఇప్పుడు కూడా చాలా వరకు ఎక్కడెక్కడ సబ్ టైటిల్స్ లో సినిమా ఉంది అనేది క్లారిటీ లేదు. ఇలాంటి బజ్ ఉన్న సినిమాలకి సింగిల్ స్క్రీన్స్, మల్టిప్లెక్స్ లలో అని తేడా లేకుండా అలా ప్లాన్ చేసుకుంటే డెఫినెట్ గా అది బిగ్ బూస్టప్ అయ్యే పనే ఇది. కానీ మేకర్స్ ఎందుకో దీనిని నెగ్లెక్ట్ చేసుకున్నారు. ఫలితం ఆడియెన్స్ లో గందరగోళం, వసూళ్ళలో కొద్దిగ అయినా ప్రభావం.
