సినీ ప్రస్థానంలో 50 వసంతాలు: ఆదర్శప్రాయం మోహన్ బాబు ప్రయాణం!

MOhan 1

టాలీవుడ్ సీనియర్ నటుడు, కలెక్షన్ కింగ్ డా. మోహన్ బాబు నేడు (మార్చి 19) పుట్టినరోజు జరుపుకుంటున్నారు. 1975లో ‘స్వర్గం నరకం’ సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఆయన, విలన్‌గా, హీరోగా విభిన్న పాత్రలతో మెప్పించి సినీ ప్రయాణంలో విజయవంతంగా 50 వసంతాలు పూర్తి చేసుకున్నారు. నటుడిగానే కాకుండా నిర్మాతగానూ 75 చిత్రాలను నిర్మించి, అత్యధిక సినిమాలు నిర్మించిన నటుడిగా భారతీయ చలనచిత్ర చరిత్రలో అరుదైన రికార్డు సృష్టించారు.

సినీ రంగంతో పాటు విద్యావేత్తగానూ ఆయన సమాజంపై చెరగని ముద్ర వేశారు. 1992లో శ్రీ విద్యానికేతన్, 2022లో మోహన్ బాబు యూనివర్సిటీలను స్థాపించి ఎంతోమందికి నాణ్యమైన విద్యను, పేద విద్యార్థులకు ఉపకారవేతనాలను అందిస్తున్నారు. కళా, విద్యా రంగాల్లో ఆయన సేవలకు గాను భారత ప్రభుత్వం 2007లో ‘పద్మశ్రీ’తో సత్కరించింది. 2016లో ఫిల్మ్‌ఫేర్ లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్, ఇటీవల 2026లో గవర్నర్ ఎక్సలెన్స్ అవార్డులను ఆయన అందుకున్నారు.

గత ఏడాది ‘కన్నప్ప’లో మహాదేవ శాస్త్రిగా మెప్పించిన మోహన్ బాబు, నేటి తరంతో పోటీ పడుతూ చురుగ్గా నటిస్తున్నారు. ఈ ఏడాది ఆయన ‘ది ప్యారడైజ్’ (శికంజా మాలిక్ పాత్ర), ‘శ్రీనివాసమంగాపురం’ చిత్రాలతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. సామాన్య స్థాయి నుంచి శిఖరాగ్రానికి ఎదిగిన ఆయన ప్రయాణం ఎందరికో ఆదర్శప్రాయం.

Exit mobile version