సెన్సార్ పూర్తి చేసుకున్న ‘రాకాస’.. హారర్ కామెడీకి ఏ సర్టిఫికెట్?

rakasa 2

ప్రస్తుతం మన తెలుగు ఆడియెన్స్ ని అలరించేందుకు వస్తున్న ఇంట్రెస్టింగ్ హారర్ కామెడీ సినిమానే ‘రాకాస’. యంగ్ అండ్ టాలెంటెడ్ జంట సంగీత్ శోభన్ హీరోగా నయన్ సారిక హీరోయిన్ గా దర్శకురాలు మానస శర్మ హీరోయిన్ గా తెరకెక్కించిన ఈ సినిమా సాలిడ్ విజువల్స్ అండ్ కామెడీని ప్రామిస్ చేస్తున్నారు. అయితే ఈ ఏప్రిల్ మొదటి వారంలో రిలీజ్ కి రాబోతున్న ఈ సినిమా ఫైనల్ గా సెన్సార్ కూడా పూర్తి చేసుకుంది.

ఈ సినిమాకి సెన్సార్ యూనిట్ వారు యూ/ఏ సర్టిఫికెట్ అందుకుంది. సో ఈ సినిమాకి పెద్దగా ఎలాంటి ఆంక్షలు లేనట్టే అని అనుకోవాలి. ట్రైలర్ తో ఆడియెన్స్ దృష్టి ఆకర్షించిన ఈ సినిమా బిగ్ స్క్రీన్స్ పై ఎలాంటి ట్రీట్ అందిస్తారో చూడాలి. ఇక ఈ సినిమాకి అనుదీప్ దేవ్ సంగీతం అందించారు అలాగే నిహారిక కొణిదెల, ఉమేష్ కుమార్ బన్సల్ నిర్మాణం వహించారు. ఇక ఈ సినిమా ఈ ఏప్రిల్ 3న విడుదల కాబోతోంది.

Exit mobile version