‘ఎల్లమ్మ’ నుంచి దేవిశ్రీప్రసాద్ స్టన్నింగ్ ఫస్ట్ లుక్ చూసారా!

మన టాలీవుడ్ టాప్ మోస్ట్ సంగీత దర్శకుల్లో ఒకరైన దేవిశ్రీప్రసాద్ ఇప్పుడు సంగీత దర్శకుడిగా మాత్రమే కాకుండా హీరోగా కూడా వర్క్ చేస్తున్న సంగతి. తన కెరీర్ మొదటి సినిమాగా ‘బలగం’ వేణు తో చేస్తున్న క్రేజీ ప్రాజెక్ట్ నే “ఎల్లమ్మ”. మంచి అంచనాలు ఉన్న ఈ ప్రాజెక్ట్ నుంచి ఆల్రెడీ వచ్చిన గ్లింప్స్ మంచి బజ్ రేకెత్తించింది.

ఇక ఫైనల్ గా మేకర్స్ నేడు దేవిశ్రీప్రసాద్ పుట్టినరోజు కానుకగా విడుదల చేసిన ఫస్ట్ లుక్ మాత్రం స్టన్నింగ్ గా ఉందని చెప్పాల్సిందే. దేవిశ్రీప్రసాద్ ఒక రెట్రో లుక్ లో ఇందులో చాలా యంగ్ గా కనిపిస్తూ ఉండడం విశేషం. దీనితో ఎల్లమ్మ పై ఇప్పుడు మరిన్ని అంచనాలు పెరిగాయి. ఇక ఈ సినిమాకి కూడా తనే సంగీతం అందిస్తున్నాడు. అలాగే దిల్ రాజు ఈ సినిమాని తమ శ్రీ వెంకటేశ్వర బ్యానర్ లో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మాణం వహిస్తున్నారు. అలాగే అతి త్వరలోనే సినిమాని విడుదలకి తీసుకురానున్నారు.

Exit mobile version