రామ్ చరణ్ కోసం ‘ధురంధర్’ టెక్నీషియన్.. వర్కవుట్ అయ్యేనా..?

RC17

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం ‘పెద్ది’ సినిమాతో బాక్సాఫీస్‌ను షేక్ చేసేందుకు సిద్ధమవుతున్నాడు. బుచ్చిబాబు సానా డైరెక్ట్ చేస్తున్న ఈ రూరల్ స్పోర్ట్స్ డ్రామాను ఏప్రిల్ 30న రిలీజ్ చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఇక ఈ సినిమా తర్వాత చరణ్ తన నెక్స్ట్ చిత్రాన్ని క్రియేటివ్ జీనియస్ సుకుమార్ డైరెక్షన్‌లో చేయబోతున్నాడు.

గతంలో ‘రంగస్థలం’ వంటి బ్లాక్‌బస్టర్ అందించిన ఈ కాంబోలో రాబోయే రెండో చిత్రం ఎలా ఉండబోతుందా అనే అంచనాలు అప్పుడే క్రియేట్ అయ్యాయి. అయితే, ఇప్పటికే ప్రీ-ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్న ఈ సినిమా కోసం బాలీవుడ్ టెక్నీషియన్లను తీసుకుంటున్నాడట సుకుమార్. ఈ క్రమంలో బాలీవుడ్‌లో ‘ధురంధర్’ చిత్రానికి సంగీతం అందించిన శాశ్వత్ సచ్‌దేవ్ చరణ్-సుకుమార్ సినిమాకు కూడా సంగీతం అందించేందుకు సిద్ధమవుతున్నాడట.

బాలీవుడ్‌లో మంచి హిట్ అందుకున్న ఈ మ్యూజిక్ డైరెక్టర్ ఇప్పుడు నిజంగానే చరణ్-సుకుమార్ సినిమాకు సెలెక్ట్ చేస్తారా.. అనేది ఆసక్తికరంగా మారింది. ఇక ఈ సినిమాను వీలైనంత త్వరగా ప్రారంభించేందుకు మేకర్స్ రెడీ అవుతున్నారు.

Exit mobile version