‘ఆదిపురుష్’ లానే ‘రామాయణ’లో ఈ తప్పులు సరి చేస్తారా?

ramayana 1

బాలీవుడ్ టాలెంటెడ్ హీరో రణబీర్ కపూర్ హీరోగా సాయి పల్లవి హీరోయిన్ గా దర్శకుడు నితీష్ తివారి తెరకెక్కిస్తున్న పీరియాడిక్ సినిమానే రామాయణ. ఇటీవల శ్రీరామ నవమి కానుకగా వదిలిన రామ టీజర్ కి పలు విమర్శలు కూడా వచ్చాయి. ముఖ్యంగా ఈ సినిమా టీజర్ లో విజువల్ ఎఫెక్టుల పై అధికంగా కామెంట్స్ వినిపించాయి.

8 సార్లు ఆస్కార్ విన్నింగ్ స్టూడియోస్ పైగా 4 వేల కోట్ల బడ్జెట్ అనే మార్క్ లు సినిమాపై అంచనాలు పెంచాయి. కానీ సీన్ కట్ చేస్తే విజువల్స్ ఏమో ఏ ఐ, ఇంకా చాలా తక్కువ నాణ్యతతో కనిపించాయి. గతంలో ఆదిపురుష్ టీజర్ కి కూడా అందులో విజువల్స్ పై గట్టి కామెంట్స్ వచ్చే సరికి ట్రైలర్ లో ఓ రేంజ్ విజువల్స్ తో ఆశ్చర్య పరిచారు. మరి అలానే రామాయణ మేకర్స్ కూడా తప్పులు సరి చేసుకొని మళ్లీ సాలిడ్ కంటెంట్ ని ప్లాన్ చేస్తారేమో చూడాలి.

Exit mobile version