ఇప్పుడు అంటే పలు భిన్నమైన థ్రిల్లర్ సినిమాలతో కొత్త దర్శకులు సినిమాలు అందిస్తున్నారు. కానీ ఎప్పుడో ఔట్ ఆఫ్ ది బాక్స్ థ్రిల్లర్ సినిమాలు అందించిన దర్శకుడు మాత్రం మన టాలీవుడ్ దర్శకుడు నటుడు రవిబాబు అందించారు. అయితే రవిబాబు నుంచి చాలా కాలం తర్వాత వస్తున్న సాలిడ్ క్రైమ్ థ్రిల్లర్ సినిమానే ‘రేజర్’.
ఆ మధ్య వచ్చిన టీజర్ గ్లింప్స్ లతో ఊహించని వైలెన్స్ ని చూపించిన తను ఈ సినిమాని ఈ ఏడాది వేసవిలోనే విడుదల చేస్తున్నట్లు కన్ఫర్మ్ చేశారు. దీనితో రవిబాబు ఫిల్మోగ్రఫీ మీద మినిమం ఐడియా ఉన్నవారు అంతా ఈ సినిమా కోసం ఎదురు చూసారు. ఇక ఫైనల్ గా ఈ సినిమాకి రిలీజ్ డేట్ ఇప్పుడు వచ్చేసింది.
దీని ప్రకారం ఈ సినిమా మే 8న గ్రాండ్ గా థియేటర్స్ లో విడుదల చేయాలని ఖరారు చేసారు. మరి ఇది రవిబాబు నుంచి తన మార్క్ హిట్ గా నిలుస్తుందో లేదో చూడాలి. ఇక స్ సినిమాని ఫ్లయింగ్ ఫ్రాగ్స్ వారు నిర్మాణం వహించగా సురేష్ ప్రొడక్షన్స్ వారు సమర్పణలో విడుదలకి రాబోతుంది.
