గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘పెద్ది’. ఈ సినిమా పై పాన్ ఇండియా స్థాయిలో భారీ అంచనాలు ఉన్నాయి. ఏప్రిల్ 30న ఈ సినిమా రిలీజ్ కావాలి. ఐతే, ఆ డేట్ కి ఈ సినిమా రిలీజ్ అయ్యేలా కనిపించడం లేదు అంటూ టాక్ ఉంది. మరి ఆ డేట్ కి రిలీజ్ కాకపోతే ప్రత్యామ్నాయంగా జూన్ నెలలో మరో తేదీని మేకర్స్ పరిశీలిస్తున్నారట. ఇంతకీ, ఆ డేట్ ఏమిటంటే.. యష్ ‘టాక్సిక్’ సినిమా జూన్ 4న రిలీజ్ కావాల్సి ఉంది. ఆ డేట్ కి ‘టాక్సిక్’ రిలీజ్ కష్టమే అంటున్నారు.
కాబట్టి, ఆ ఖాళీని భర్తీ చేస్తూ జూన్ 4న ‘పెద్ది’ని రిలీజ్ చేయాలని చూస్తున్నారట. మరి ఏప్రిల్ 30వ తేదీ మిస్ అయితే, జూన్ 4న ఈ సినిమా వస్తోందా? చూడాలి. ఇక ఈ సినిమాకు సంబంధించి విడుదలైన ‘ఫస్ట్ గ్లింప్స్’, సాంగ్స్ తో మేకర్స్ సినిమా పై అంచనాలను భారీగా పెంచేశారు. ఇక ఈ సినిమాలో జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తోంది. ఈ పెద్దిలో శివ రాజ్‌కుమార్, జగపతి బాబు, దివ్యేందు శర్మ, బోమన్ ఇరానీ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. అన్నట్టు ఈ స్పోర్ట్స్ డ్రామాకు ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నారు.
