లీక్ తర్వాత ‘జన నాయగన్’ థియేటర్స్ రిలీజ్ డేట్ వైరల్!

Jana Nayagan

ఇళయ దళపతి విజయ్ హీరోగా పూజా హెగ్డే హీరోయిన్ గా దర్శకుడు హెచ్ వినోద్ తెరకెక్కించిన అవైటెడ్ సినిమానే ‘జన నాయగన్’. ఈ చిత్రానికి మాత్రం ఎన్నో అవాంతరాలు ఎదురయ్యాయని చెప్పాలి. థియేటర్స్ లో విడుదల ఆలస్యం అవుతుంది అనేదే పెద్ద ఇబ్బంది అయితే దీనికి ముందే ఆన్లైన్ లో సినిమా లీక్ అవ్వడం అనేది మరింత షాకింగ్ గా మారింది. దీనితో అభిమానులు కొంచెం త్వరితగతిన రిలీజ్ ని ఆశిస్తున్నారు.

ఇక ఈ నేపథ్యంలో ఈ సినిమా రిలీజ్ పై లేటెస్ట్ బజ్ ఒకటి వైరల్ అవుతుంది. దీని ప్రకారం జన నాయగన్ రేపు ఏప్రిల్ 15న మరోసారి సెన్సార్ కి వెళ్లనుండగా ఈ ఏప్రిల్ 30న గ్రాండ్ రిలీజ్ కి సిద్ధం కానున్నట్టు తెలుస్తుంది. మేకర్స్ ఆల్రెడీ భారీ డ్యామేజ్ చూసేసారు. మరి ఈ కొత్త రిలీజ్ డేట్ పై ఓ ఫైనల్ క్లారిటీ ఇంకా రావాల్సి ఉంది. ఇక ఈ సినిమాకి అనిరుద్ సంగీతం అందించగా కే వి ఎన్ ప్రొడక్షన్స్ వారు నిర్మాణం వహిస్తున్నారు.

Exit mobile version