స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు అత్యంత భారీ బడ్జెట్‌తో ‘జటాయు’ అనే మైథలాజికల్ ఫాంటసీ చిత్రాన్ని రూపొందించేందుకు రెడీ అవుతున్నారు. దర్శకుడు మోహనకృష్ణ ఇంద్రగంటి గత రెండేళ్లుగా ఈ కథపై వర్క్ చేస్తున్నాడు. మొదట విజయ్ దేవరకొండ చేయాల్సిన ఈ ప్రాజెక్ట్‌లోకి, ఆయన డేట్స్ సర్దుబాటు కాకపోవడంతో యువ హీరో రోషన్ మేకా ఎంట్రీ ఇచ్చాడు. ఈ ఏడాది దసరా తర్వాత ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కానుంది.
దర్శకుడు ఇంద్రగంటికి ఈ మధ్య కాలంలో సరైన హిట్ లేదు, అలాగే రోషన్ ఇంకా కెరీర్ ఆరంభంలోనే ఉన్నాడు. అయినప్పటికీ, రిస్క్‌ను లెక్కచేయకుండా కథపై ఉన్న నమ్మకంతో దిల్ రాజు ఈ సినిమాపై భారీ బడ్జెట్ పెడుతున్నారు. తన జడ్జ్‌మెంట్‌తో ఈసారి కూడా పెద్ద విజయం అందుకోవాలని ఆయన పట్టుదలతో ఉన్నారు.
మరోవైపు, దిల్ రాజు నిర్మాణంలో ఉన్న విజయ్ దేవరకొండ ‘రౌడీ జనార్దన్’, దేవిశ్రీ ప్రసాద్ ‘ఎల్లమ్మ’, ఆశిష్ రెడ్డి ‘దేత్తడి’ చిత్రాలు 2027 వేసవి లోపే విడుదల కానున్నాయి. అలాగే సల్మాన్ ఖాన్ – వంశీ పైడిపల్లి చిత్రం కూడా ఇటీవలే పట్టాలెక్కింది.
