‘పుష్ప 2’ రికార్డును బ్రేక్ చేసిన ‘ధురంధర్ 2’.. ఇక దానిపైనే కన్ను..!

Pushpa-Vs-Dhurandhar

ఇండియన్ సినిమా బాక్సాఫీస్ దగ్గర రికార్డుల వేట సరికొత్త మలుపు తిరిగింది. గతేడాది సంచలనం సృష్టించిన ‘పుష్ప 2’ వసూళ్లను అధిగమిస్తూ ‘ధురంధర్ ది రివెంజ్’ బాక్సాఫీస్ వద్ద తన సత్తా చాటింది. ట్రేడ్ వర్గాల సమాచారం ప్రకారం, ఈ చిత్రం రూ.1743 కోట్లతో ఇండియన్ టాప్-3 సినిమాల జాబితాలోకి సగర్వంగా చేరింది. ప్రస్తుతం రూ.1789 కోట్లతో ‘బాహుబలి 2′ రెండో స్థానంలో, రూ. 2070 కోట్లతో ‘దంగల్’ మొదటి స్థానంలో కొనసాగుతున్నాయి.

నాలుగు గంటల రన్‌టైమ్ ఉన్నప్పటికీ, ఎటువంటి ఫాంటసీ లేదా భారీ వీఎఫ్ఎక్స్ లేకుండా కేవలం గ్రిప్పింగ్ స్పై డ్రామాతో ఇంతటి విజయం సాధించడం బాలీవుడ్ చరిత్రలో ఒక అరుదైన రికార్డు. సాధారణంగా స్పై సినిమాల్లో ఉండే యాక్షన్ సీన్లకు భిన్నంగా, ఒక కొత్త తరహా మేకింగ్‌ను పరిచయం చేస్తూ ‘ధురంధర్’ సక్సెస్ సాధించింది. దీని ప్రభావం వల్ల ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న పలు స్పై త్రిల్లర్లు తమ స్క్రిప్టులను మార్చుకోవాల్సి వస్తుండటం గమనార్హం.

అయితే, ఇప్పుడు అందరి ఆసక్తి ఈ చిత్రం రూ. 2000 కోట్ల క్లబ్‌లో చేరుతుందా లేదా అనే అంశంపై ఉంది. దుబాయ్ వంటి దేశాల్లో ఈ సినిమాపై నిషేధం ఉండటం, చైనా-జపాన్ మార్కెట్లలో ఇలాంటి సినిమాలకు ఆదరణ తక్కువగా ఉండటం వల్ల రెండు వేల కోట్ల మైలురాయిని అందుకోవడం కాస్త సవాలుతో కూడుకున్న పని అనిపిస్తోంది.

Exit mobile version