‘పెద్ది’ స్పెషల్ కోసం మరో బ్యూటీ.. ఆమె నిజంగానే స్పెషల్..!

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న లేటెస్ట్ చిత్రం ‘పెద్ది’ కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ చివరిదశకు చేరుకోగా, ఈ సినిమాలో ఓ స్పెషల్ సాంగ్ షూటింగ్ బ్యాలెన్స్ ఉన్న సంగతి తెలిసిందే. అయితే, ఈ స్పెషల్ సాంగ్ షూట్‌కు సంబంధించి ఒక అదిరిపోయే అప్‌డేట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ చిత్రంలో రామ్ చరణ్‌తో కలిసి చిందేయడానికి గ్లామర్ బ్యూటీ శ్రుతి హాసన్ సిద్ధమైనట్లు సమాచారం.

ఇప్పటివరకు ఈ స్పెషల్ సాంగ్ కోసం మృణాల్ ఠాకూర్, సంయుక్త పేర్లు బాగా హల్‌చల్ చేశాయి. అయితే, ఇప్పుడు శ్రుతి హాసన్ ఈ స్పెషల్ సాంగ్ చేసేందుకు ఓకే చెప్పినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. గతంలో శ్రుతి హాసన్ పలు సినిమాల్లో స్పెషల్ సాంగ్స్ చేసింది. మహేష్ బాబు నటించిన ‘ఆగడు’, నాని నటించిన ‘హాయ్ నాన్న’ చిత్రాల్లో స్పెషల్ సాంగ్స్‌లో మెరిసింది. ఇక రామ్ చరణ్ సరసన ‘ఎవడు’ సినిమాలో నటించింది. దీంతో ఇప్పుడు చరణ్ సరసన మరోసారి ఈ బ్యూటీ చిందులు వేస్తే అది నిజంగా ‘స్పెషల్’ అవుతుందని అభిమానులు భావిస్తున్నారు.

మరి నిజంగానే రామ్ చరణ్ ‘పెద్ది’ కోసం శ్రుతి స్పెషల్ సాంగ్‌లో డ్యాన్స్ చేస్తుందా అనేది ఆసక్తికరంగా మారింది. ఇక ఈ సినిమాలో జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తుండగా బుచ్చిబాబు సానా ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేస్తున్నాడు. జూన్ 2026లో ఈ చిత్రాన్ని గ్రాండ్ రిలీజ్ చేసేందుకు మేకర్స్ రెడీ అవుతున్నారు.

Exit mobile version