ఇప్పుడు పాన్ ఇండియా లెవెల్లో ఓ రేంజ్ లో భారీ హైప్ ఉన్న బిగ్గెస్ట్ ప్రాజెక్ట్ లలో దర్శకుడు ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్న సెన్సేషనల్ సినిమాలు కూడా ఒకటి. అయితే ఈ సినిమాల్లో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తో చేయనున్న సలార్ 2 పట్ల భారీ అంచనాలు నెలకొన్నాయి.
కానీ దీనికి ముందు మాత్రం మ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్ తో మరో భారీ ప్రాజెక్ట్ ని నీల్ తెరకెక్కిస్తుండగా ఇప్పుడు సలార్, ఎన్టీఆర్ నీల్ ప్రాజెక్ట్ ల క్రాసోవర్ పై ఫ్యాన్స్ మైండ్ బ్లాక్ చేసే రకమైన సూచనలు కనిపిస్తున్నాయి. గత 2024 లో సలార్ నటుడు పృథ్వీ రాజ్ సుకుమారన్ ఓ ఇంట్రెస్టింగ్ లీక్ అందించాడు.
ప్రశాంత్ నీల్ ప్లాన్ చేసుకున్న కథలు అన్నీ నాకు తెలుసు అని వాటిలో తన శివ్ మన్నార్ పాత్రతో క్రాసోవర్ లో కనిపించే మరో సినిమా కూడా ఉంటుంది అని చెప్పడం జరిగింది. అయితే లేటెస్ట్ గా ఎన్టీఆర్ నీల్ ప్రాజెక్ట్ నుంచి వచ్చిన కొన్ని ఫోటోలు వైరల్ అయ్యిన సంగతి తెలిసిందే.
వాటిలో కొందరు గ్యాంగ్ ని చూస్తే సలార్ ఎండింగ్ లో అన్ని తెగలు వారు ప్రిపేర్ చేసుకున్న తమ తమ ఆర్మీలో కనిపించిన వారు గుర్తు రాక మానరు. ఈ నేపథ్యంలోనే పృథ్వీరాజ్ చెప్పిన లీక్ కి లింక్ చేసి చూస్తే సలార్ X ఎన్టీఆర్ నీల్ సినిమాలు క్రాసోవర్ తో కొత్త సినిమాటిక్ యూనివర్స్ ని ప్రశాంత్ నీల్ ప్లాన్ చేస్తున్నాడా అనే అనుమానం రాక మానదు. ఇదే గాని జరిగితే మాత్రం ఆడియెన్స్ కి మైండ్ బ్లాక్.. బాక్సాఫీస్ బ్లాస్ట్ కావడం గ్యారెంటీ. సో వీటి అన్నిటికీ కాలమే సమాధానం చెప్పాల్సి ఉంది.
Of all the stories Prashanth has told me..Shiv Mannar’s is probably the coolest. Has an unbelievable cross over with another universe as well. 😊 https://t.co/edOXTaNsZx
— Prithviraj Sukumaran (@PrithviOfficial) May 7, 2024
