సైలెంట్ గా ఓటిటిలో స్ట్రీమింగ్ కి వచ్చేసిన ‘రంభ ఊర్వశి మేనక’.. ఎందులో అంటే!

టాలీవుడ్ స్టార్ కమెడియన్ హీరో అల్లరి నరేష్ చాలా కాలం గ్యాప్ తర్వాత చేసిన కామెడీ ఎంటర్టైనర్ చిత్రమే రంభ ఊర్వశి మేనక. దర్శకుడు చింతాడ చంద్ర మోహన్ తెరకెక్కించిన ఈ సినిమా ఓ మోస్తరు గానే ఆకట్టుకుంటుంది. గ్లామరస్ బ్యూటీలు రాశి సింగ్, విష్ణు ప్రియా అలాగే ప్రిషా సింగ్ లు నటించిన ఈ సినిమా ఇప్పుడు మూడు వారాల థియేట్రికల్ రన్ తర్వాత ఓటిటిలోకి వచ్చేసింది.

ఈ సినిమా స్ట్రీమింగ్ హక్కులని అమెజాన్ ప్రైమ్ వీడియో వారు సొంతం చేసుకున్నారు. ఇక ఇందులో ఈ సినిమా నేటి నుంచి సైలెంట్ గా స్ట్రీమింగ్ కి వచ్చేసింది. సో ఈ కామెడీ డ్రామాని అప్పుడు ఎవరైనా మిస్ అయితే ఇప్పుడు ప్రైమ్ వీడియోలో చూడొచ్చు. ఇక ఈ చిత్రానికి చైతన్ భరద్వాజ్ సంగీతం అందించగా రాజేష్ దండ అలాగే ప్రసాద్ నిమ్మకాయల సంయుక్తంగా ఈ ఫాంటసీ ఎంటర్టైనర్ నిర్మాణం వహించారు.

సమీక్ష కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి

Exit mobile version