షారుక్ ఖాన్, సిద్ధార్థ్ ఆనంద్ కాంబినేషన్‌లో రూపుదిద్దుకుంటున్న మోస్ట్ అవేటెడ్ మూవీ ‘కింగ్’ గురించి ఒక ఆసక్తికరమైన వార్త నెట్టింట వైరల్ అవుతోంది. ఈ సినిమాలో షారుక్‌కు జోడీగా నటిస్తున్న దీపికా పదుకొణె, ప్రస్తుతం జరుగుతున్న షూటింగ్ షెడ్యూల్‌లో పాల్గొంటుంది. తాజా సమాచారం ప్రకారం, ఈ షెడ్యూల్‌లో ఆమెపై కీలకమైన యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు.
నిజానికి దీపికా త్వరలో రెండోసారి తల్లి కాబోతున్నట్లు ప్రకటించడంతో, ‘కింగ్’ సినిమాలో ఆమె చేయాల్సిన రిస్కీ ఫైట్ సీక్వెన్స్‌లను తగ్గిస్తారని అందరూ భావించారు. కానీ, అందుకు భిన్నంగా ఏప్రిల్ 21, 22 తేదీల్లో ఆమె భారీ యాక్షన్ సన్నివేశాల్లో పాల్గొని అందరినీ ఆశ్చర్యపరిచిందట. ఈ యాక్షన్ సీన్స్ కోసం చిత్రబృందం ప్రత్యేకంగా ఒక సెట్‌ను కూడా రూపొందించినట్లు తెలుస్తోంది.
త్వరలోనే ఇసుక నేపథ్యంలో సాగే మరో భారీ ఫైట్ సీన్‌ను దర్శకుడు ప్లాన్ చేశాడు. ఇందులో షారుక్, దీపికా కలిసి 8 మందితో తలపడనున్నారట. మరోవైపు, ఈ సినిమా విడుదలపై వస్తున్న ఊహాగానాలకు తెరదించుతూ, చిత్ర యూనిట్ తాజాగా ఒక వీడియోను విడుదల చేసింది. డిసెంబర్ 24న క్రిస్మస్ కానుకగా ‘కింగ్’ థియేటర్లలోకి రాబోతున్నట్లు స్పష్టం చేయడంతో అభిమానులు పండగ చేసుకుంటున్నారు.
