పాప్ ప్రపంచానికి రారాజు మైఖేల్ జాక్సన్ జీవిత చరిత్రపై తెరకెక్కిన అవైటెడ్ సినిమానే మైఖేల్. నిజ జీవిత మైఖేల్ జాక్సన్ మేనల్లుడు అయినటువంటి జాఫర్ జాక్సన్ ప్రధాన పాత్రలో నటించిన ఈ లెజెండరీ బయోపిక్ ఇప్పుడు ప్రేక్షకుల మన్ననలు అందుకుంటుంది. మైఖేల్ ని ఎంతగానో ఆరాధించే అభిమానులు ఈ సినిమా చూసి మరింత భావోద్వేగానికి లోనవుతున్నారు.
అయితే మేకర్స్ ఈ లెజెండ్ తాలూకా జీవితాన్ని ఒక్క పార్ట్ లోనే చూపిస్తారా అనే ప్రశ్నకు పార్ట్ 2 ని కూడా లీడ్ ఇస్తూ సెకండాఫ్ లో సర్ప్రైజ్ చేశారు. ఇక ఫైనల్ గా ఈ పార్ట్ 2 కి పర్ఫెక్ట్ టైటిల్ ని పెట్టారు. మొదటి భాగం మైఖేల్ గా వస్తే పార్ట్ 2 మైఖేల్ జాక్సన్ గా పెట్టినట్టు ఓ టైటిల్ వైరల్ అవుతుంది. కానీ ఇందులో ఎంతమేర నిజం ఉంది అనేది తెలియాల్సి ఉంది.
ఇది వినేందుకు సింపుల్ గానే ఉండొచ్చు కానీ చాలా లోతైన అర్ధం కూడా ఇందులో దాగివుంది. నిజానికి మైఖేల్ జాక్సన్ పూర్తి జీవితం పార్ట్ 2 తోనే ముగియనుంది. సో ఈ లెజెండరీ బయోపిక్ టైటిల్ ని రెండు భాగాలకు ఇలా సెట్ చేసినా ఆశ్చర్యం లేదు అనుకోవచ్చు. అలాగే పార్ట్ 2 ని 2028 ఏప్రిల్ లో థియేటర్స్ లో తెస్తారు అంటూ మరో రూమర్ స్టార్ట్ అయ్యింది. కానీ ఇందులో కూడా ఎంతమేర నిజం ఉంది అనేది తెలియాల్సి ఉంది.
