‘పెద్ది’లో రామ్ చరణ్ సర్‌ప్రైజ్ ఇవ్వనున్నాడా..?

peddi

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, బుచ్చిబాబు సానా కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న స్పోర్ట్స్ డ్రామా ‘పెద్ది’ ప్రస్తుతం షూటింగ్ చివరిదశకు చేరుకుంది. ఈ సినిమాలో చరణ్ మాస్ లుక్‌తో కనిపిస్తూ ప్రేక్షకులను థ్రిల్ చేసేందుకు రెడీ అవుతున్నాడు. అయితే, ఈ సినిమాలో రామ్ చరణ్ అభిమానులకు అదిరిపోయే సర్‌ప్రైజ్ ఇచ్చేందుకు రెడీ అవుతున్నాడట.

ఈ సినిమాలో చరణ్ మూడు విభిన్నమైన లుక్స్‌లో కనిపించబోతున్నాడనే వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే మాస్ లుక్ సోషల్ మీడియాలో వైరల్ అవ్వగా, తాజాగా ఆయన ఫిట్‌నెస్ ట్రైనర్ రాకేష్ ఉడియార్ వెల్లడించిన వివరాల ప్రకారం.. మూడవ లుక్‌ను మేకర్స్ అత్యంత రహస్యంగా ఉంచారట. ఇది థియేటర్లలో ప్రేక్షకులకు సర్ప్రైజ్‌గా ఉండబోతోందని తెలుస్తోంది.

ఈ భారీ బడ్జెట్ చిత్రంలో జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తుండగా, కన్నడ స్టార్ శివరాజ్‌కుమార్, జగపతిబాబు మరియు దివ్యేందు శర్మ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఆస్కార్ విజేత ఏఆర్ రెహమాన్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నాడు. వృద్ది సినిమాస్ బ్యానర్‌పై అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న ఈ చిత్రాన్ని 2026, జూన్ 25న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయడానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.

Exit mobile version