ధనుష్ కెరీర్లోనే అతి తక్కువ బుకింగ్స్?

kara

కోలీవుడ్ స్టార్ నటుడు ధనుష్ హీరోగా మమితా బైజు హీరోయిన్ గా దర్శకుడు విగ్నేష్ రాజా తెరకెక్కించిన లేటెస్ట్ చిత్రమే ‘కర’. ధనుష్ మార్క్ స్పీడ్ లో ఎన్నో సినిమాలతో పాటలుగా ఈ సినిమాని కూడా పూర్తి చేసేసి ఈ ఏడాదిలో తన మొదటి సినిమాగా విడుదలకి రాబోతుంది. అయితే తెలుగు, తమిళ్, హిందీ లలో ఇవాళ్టి నుంచే రిలీజ్ కి వస్తున్న ఈ సినిమా ధనుష్ కెరీర్ లోనే అతి తక్కువ బజ్ తో వస్తుంది అని చెప్పాలి.

తన గత సినిమా ఇడ్లీ కడై కి రిలీజ్ రోజుకే గత 24 గంటల బుకింగ్స్ లో 90 వేలకి పైగా టికెట్స్ బుక్ మై షోలో సేల్ అయ్యాయి. కానీ కర పరిస్థితి మాత్రం ఇంకా దారుణంగా ఉందని చెప్పాలి. దీనికి గత 24 గంటల్లో కేవలం 45 వేల టికెట్స్ మాత్రమే బుక్ అయ్యాయి. ఇది మాత్రం మరింత డౌన్ ఫాల్ అనే చెప్పాలి. ఒక రకంగా ఇదే ధనుష్ కెరీర్ లో అతి తక్కువ బుకింగ్స్ అని కూడా అనుకోవచ్చు. మరి ఈ మేర బుకింగ్స్ తో ఓపెనింగ్స్ ఎలా ఉంటాయో చూడాలి.

Exit mobile version