SSR61 : జోనర్ ఏమిటో రివీల్ చేసిన మేకర్స్..!

లెజెండరీ డైరెక్టర్ సింగీతం శ్రీనివాసరావు దర్శకత్వంలో వైజయంతీ మూవీస్ నిర్మిస్తున్న లేటెస్ట్ చిత్రం #SSR61 పై సోషల్ మీడియాలో భారీ హైప్ నెలకొంది. ఈ చిత్ర షూటింగ్ ఇప్పటికే శరవేగంగా జరుపుకుంటోంది. ఇక ఈ సినిమాకు సంబంధించిన టైటిల్, టీజర్ మే 1న రిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ ఇప్పటికే వెల్లడించారు. అయితే, తాజాగా ఈ చిత్రం ఏ జోనర్‌లో తెరకెక్కుతుందనే విషయంపై మేకర్స్ క్లారిటీ ఇచ్చారు.

సింగీతం తన ఫిల్మోగ్రఫీలో పలురకాల జోనర్స్ టచ్ చేశారు. ఇక ఈసారి ఆయన ఓ మ్యూజికల్ ఫిల్మ్ ను రూపొందిస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టును ‘కల్కి 2898 AD’ దర్శకుడు నాగ్ అశ్విన్ స్వయంగా నిర్మిస్తుండగా, వైజయంతీ ఫిల్మ్స్ మరియు స్వప్న సినిమాస్ సంస్థలు సంయుక్తంగా ఈ సినిమాను మన ముందుకు తీసుకువస్తున్నాయి. రాక్‌స్టార్ దేవిశ్రీ ప్రసాద్ ఈ చిత్రానికి సంగీతాన్ని అందిస్తున్నాడు. సింగీతం మార్క్ క్రియేటివిటీకి, దేవిశ్రీ ప్రసాద్ అందించే స్వరాలు తోడైతే ఈ మ్యూజికల్ జర్నీ సరికొత్త అనుభూతిని ఇస్తుందని సినీ వర్గాలు భావిస్తున్నాయి.

Exit mobile version