ఓటిటి సమీక్ష: ‘ఆరాధన’ – తెలుగు లఘు చిత్రం ఈటీవీ విన్ లో

ఓటీటీ స్ట్రీమింగ్ తేది : మే 03, 2026
ఓటీటీ స్ట్రీమింగ్ వేదిక : ఈటీవీ విన్

123తెలుగు.కామ్ రేటింగ్ : 2.75/5

నటీనటులు: సమీర్, ఆమని, శివ ప్రసన్న, మదన్, ఐశ్వర్య తదితరులు
దర్శకత్వం: దేవరకొండ శ్రీకాంత్
సంగీతం: రాకేష్ వెంకటాపురం
ఛాయాగ్రహణం: మౌర్య ఇల
కూర్పు: ఎస్ జె శివ కిరణ్

సంబంధిత లింక్స్ :  ట్రైలర్ 

తెలుగు స్ట్రీమింగ్ యాప్ ఈటీవీ విన్ లో ప్రసారం అవుతున్న వీక్లీ సిరీస్ కథా సుధ నుంచి లేటెస్ట్ గా వచ్చిన కొత్త లఘు చిత్రమే ‘ఆరాధన’. మరి ఈ సినిమా ఎలా ఉందో సమీక్షలో చూద్దాం రండి.

కథ:

తమ యుక్త వయస్సులోనే ఇంట్లో పెద్దలు ఒప్పుకోరు అని తమ ప్రేమని గెలిపించుకోవడానికి కృష్ణ మూర్తి (సమీర్), రాధ (ఆమని)లు బయటకి వెళ్ళిపోయి పెళ్లి చేసుకుందాం అనుకుంటారు కానీ ఓ కారణం చేత వారు విడిపోతారు. మళ్ళీ 30 ఏళ్ల తర్వాత వారికి ఆ అవకాశం వస్తుంది. అప్పటికే ఇద్దరికీ పెళ్ళిళ్ళు, పిల్లలు ఉంటారు కానీ ఒంటరి గానే ఉంటారు. సో అప్పుడు విడిపోవడం ఇప్పుడు మళ్ళీ అవకాశం రావడంతో పెళ్లి చేసుకుందామని డిసైడ్ అయ్యిన ఈ జంట పెళ్లి జరిగిందా లేదా? ఈసారైనా తమ ప్రేమ గెలిపించుకున్నారా లేదా అనేది తెలియాలి అంటే ఈ చిత్రాన్ని చూసి తెలుసుకోవాలి.

ప్లస్ పాయింట్స్:

ప్రేమ అనేది ఒక నిర్వచనం లేని అనుభూతిని దీనిని అర్ధవంతంగా ప్రెజెంట్ చేస్తే దాని ఫీల్ మరింత అందంగా అనిపిస్తుంది. ఆ విషయంలో దర్శకుడు ఈ లఘు చిత్రానికి సక్సెస్ అయ్యారని చెప్పొచ్చు. ఎప్పుడో మిస్ అయ్యిన ప్రేమకు మళ్ళీ ఛాన్స్ దొరకడం అనేది దాదాపు జరగని అంశమే కానీ దానిని నీట్ గా దర్శకుడు ప్రెజెంట్ చేయడం ఇందులో బాగుంది.

అలానే దీనికి అనుగుణంగా డిజైన్ చేసుకున్న క్లీన్ ప్రేమ కథనం, క్లైమాక్స్ ఎమోషనల్ పార్ట్ ఎండింగ్ ఓకే అనిపిస్తాయి. అలానే సమీర్, ఆమనిలు తమ పాత్రలకి పూర్తి న్యాయం చేశారు. అలానే ఇతర తారాగణం కూడా బాగా చేశారు.

మైనస్ పాయింట్స్:

ఇందులో కథనం చాలా నెమ్మదిగా నడుస్తుంది. పైగా ఈ కథాసుధలో వచ్చిన గత సినిమాలతో పోలిస్తే ఇదే నిడివి కూడా ఎక్కువ అంత నిడివి పైగా స్లో కథనం కొంచెం బోర్ అనిపించవచ్చు. అలానే ఇందులో ప్లాట్ ఇంకా కొంతమేర సీన్స్ కూడా కొత్తగా ఏమీ అనిపించవు.

సో ఆల్రెడీ తెలిసిన స్టోరీనే చూస్తున్నట్టు అనిపిస్తుంది. ఇక వీటితో పాటుగా క్లైమాక్స్ పార్ట్ లో ఇచ్చిన విషాద ముగింపు కూడా ఒకింత రొటీన్ గానే అనిపిస్తుంది. ప్రేమకి, ఆరాధనకు చిన్నపాటి వ్యత్యాసాన్ని బాగానే చెప్పిన దర్శకుడు ఈ ముగింపు కూడా ఒక హ్యాపీ ఎండింగ్ ప్లాన్ చేసుకుకొని ఉంటే బాగుండేది.

సాంకేతిక వర్గం:

ఈ లఘు చిత్రంలో నిర్మాణ విలువలు డీసెంట్ అని చెప్పొచ్చు. కెమెరా వర్క్, సంగీతం బాగున్నాయి. ఎడిటింగ్ ఇంకొంచెం ఫాస్ట్ గా నడిపించాల్సింది. ఇక దర్శకుడు దేవరకొండ శ్రీకాంత్ ఒకింత రొటీన్ అంశాన్నే పెట్టుకున్నప్పటికీ ఇందులో సోల్ ని తాను ఏం చెప్పాలి అనుకున్నారో ఆ అంశాన్ని బాగానే చెప్పారు. కాకపోతే ఈ ప్రక్రియలో కథనం కొంచెం నెమ్మదిగా ఆల్రడీ చూసినట్టే ఉన్నాయనిపించే సన్నివేశాలతో నడిపించారు. వీటిని పక్కన పెడితే తన వర్క్ బాగానే ఉంది.

తీర్పు:

ఇక మొత్తంగా చూసుకున్నట్టయితే ఈ ‘ఆరాధన’ అనే లఘు చిత్రంలో సోల్ అండ్ ఎమోషన్స్ బాగున్నాయి. అలానే సమీర్, ఆమనిల పెర్ఫామెన్స్ లు కూడా డీసెంట్ గా ఉన్నాయి. కాకపోతే స్లోగా సాగే కథనం కొన్ని రెగ్యులర్ సీన్స్ ఇందులో రొటీన్ గా అనిపిస్తాయి. ఇవి పక్కన పెట్టి ఒక మంచి లవ్ స్టోరీ చూడాలి అనుకుంటే ఆరాధన కనెక్ట్ అవుతుంది.

123telugu.com Rating: 2.75/5

Reviewed by 123telugu Team 

Exit mobile version